అన్వేషించండి

MLC Driver Subrahmanyam Murder Case: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం! అజ్ఞాతంలోకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు! అసలేం జరుగుతోంది?

MLC Driver Subrahmanyam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు దర్యాప్తులో  ఏపీ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం నిప్పులు చెరిగింది.

MLC Driver Subrahmanyam Murder Case:వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్ అవుతోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ హత్య కేసులో తన భార్య పాత్ర కూడా ఉందని సిట్ తేల్చడంతో ఎమ్మెల్సీ అనంత బాబు అజ్ఞాతంలోకి వెళ్లడం సంచలనంగా మారింది. ఈ కేసులో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది? సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఏంటీ? 

మీ వల్ల కాకాపోతే చెప్పండి! సుప్రీంకోర్టు ఆగ్రహం 

డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు దర్యాప్తులో  ఏపీ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం నిప్పులు చెరిగింది. కేసును దర్యాప్తు చేసి ఒక కొలిక్కి తీసుకురావడం రాష్ట్ర పోలీసుల వల్ల కాదంటే చెప్పండి, వెంటనే సీబీఐకి అప్పగిస్తామని ఘాటుగా కామెంట్ చేసింది. నిందితుడికి మేలు చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు భావించింది. ముఖ్యంగా నిందితుడికి డీఫాల్డ్ బెయిల్ వచ్చేలా వరకు ఆగి, ఆ తర్వాతే ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

హత్య జరిగిన టైంలో తప్పు చేసిన పోలీసుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది ధర్మాసనం. అసలు డీజీపీ, ఏస్పీలు, ఏం చేస్తున్నారని కోర్టు నిలదీసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు ఉందని కామెంట్స చేసింది. 

నవంబ్ డెడ్‌లైన్- హైకోర్టు పర్యవేక్షణ 

ఈ కేసును సాగదీయడం ఇక కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ 18 లోపు ట్రయల్ పూర్తి చేయాలని కోర్టును ఆదేశించింది. విచారణ ప్రక్రియను హైకోర్టు పర్యవేక్షించాలని, రోజువారీ విచారణ జరిగేలా చూడాలని సూచించింది. మార్చి 31లోపు ఒక ప్రత్యేక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని కూడా కోర్టు హైకోర్టును ఆదేశించింది. కేసు విచారణకు అడ్డంకులు కలిగేలా ఎలాంటి స్టేలు ఇవ్వకూడదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. 

సీన్‌లోకి ఎమ్మెల్సీ భార్య- అజ్ఞాతంలోకి అనంతబాబు 

ఈ కేసులో తాజాగా మరో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దళిత యువకుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో అనంత బాబుతోపాటు ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గ కూడా పాల్గొన్నారని సిట్ నిర్ధారించింది. ఈ హత్యకు ఆమె ప్రేరేపించడమే కాకుండా, నేరంలో అన్ని విధాలా సహరించిందని సిట్ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 

తన భార్యపై ఛార్జిషీట్‌ దాఖలైందని తెలియగానే, ఎమ్మెల్సీ అనంత బాబు హుటాహుటిన అజ్ఞాతంలోకి వెళ్లారు. శాసనమండలిలో ఉన్న ఆయన, కనీసం గన్‌మెన్‌లను గానీ, వ్యక్తిగత సిబ్బందిని కానీ తీసుకోకుండా అర్ధంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. భార్యను అరెస్టు కాకుండా కాపాడుకునేందుకు ఆయన ఇలా చేశారని సమాచారం. ప్రస్తుతం పోలీసుల లక్ష్మీదుర్గ కోసం గాలిస్తున్నారు.     

అసలు కేసు ఏంటీ?

2022 మే19న తేదీన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతబాబే స్వయంగా ఆ మృతదేహాన్ని తన  కారులో తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే తమ కొడుకును ఎమ్మల్సీ చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు పెద్ద మలుపు తిరిగింది. ఆ తర్వాత పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget