అన్వేషించండి

MLC Anantababu Case : ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు సీబీఐకి వెళ్తుందా ? - తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు !

దళితుడ్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతాబాబు హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

MLC Anantababu Case :  దళితుడు అయిన  మాజీ డ్రైవర్ ను చంపి, డోర్ డెలివరీ చేసిన కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టు వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది.  అనంత్‌బాబు కేసును సీబీఐకి అప్పగించాలని కో  హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరపున వాదనలు వినిపించిన  లాయర్ జడ శ్రవణ్ కుమార్ పోలీసులు అసలు దర్యాప్తు జరపలేదని ఆధారాలను తుడి చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీసీ పుటేజీ వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. ఈ సందర్భంగా సీసీ ఫుటేజ్‌లో ఉన్నవారిని ఎందుకు కేసులో చేర్చలేదని హైకోర్టు ప్రభుత్వం తరపున్యాయవాదిని ప్రశ్నించారు.  కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని..  సహ నిందితుల్ని వదిలేశారని ఆరోపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా  కేసు వివరాలు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు   ప్రభుత్వం సమర్పించింది. 

ఈ పిటిషన్‌పై విచారణలో  హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులకు అనుగుణంగా అనుబంధ చార్జ్‌షీట్ లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని అతని తల్లిదండ్రులు వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్ వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌ తెచ్చారు. సింగిల్ జడ్జ్ ఆదేశించినా సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నవారు ఎవరో పోలీసులు కనుక్కోకపోవడంపై అభ్యంతరం హైకోర్టు అభ్యంతరం తెలిపింది. హత్యలో వారి పాత్ర లేదని ఎలా నిర్దారణకు వచ్చారు..? అని ధర్మాసనం ప్రశ్నించింది. వివరాలను అదనపు చార్జ్‌షీట్‌లో ఎందుకు పేర్కొనలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తాజాగా విచారణలో పిటిషనర్ల తరపు లాయర్ అవే అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

మరో వైపు అనంతబాబు తరపులాయర్  ఈ కేసును సీబీఐకి ఇవ్వవొద్దని వాదించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వాదనలు వినేందుకు హైకోర్ట ధర్మాసనం అంగీకరించలేదు. తీర్పును రిజర్వ్ చేసింది.  మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం  బెయిల్ మీద ఉన్నారు.   సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  అనంతబాబును అరెస్టు చేసి.. 90 రోజులు దాటి పోయిందని పోలీసులు దర్యాప్తు చేయడం లేదని అందుకే   బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఏవో కారణాలు చెప్పి.. ఛార్జిషీట్ దాఖలు చేయడం బెయిల్ ఇవ్వాలని కోరడంతో  ..  అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది.  పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు  చేయడం లేదని.. అనంతబాబు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

అనంతబాబు ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఈ హత్య సంచలనం సృష్టించింది.   నిందితుడ్ని కాపాడేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో అనంతబాబు తాను హత్య చేసినట్లుగా అంగీకరించారు. కానీ ఆయన ఒక్కరే కాదని.. వెనుక ఇంకా చాలా  మంది ఉన్నరన్న ఆరోపణల ప్రకారం పోలీసులు  లోతైన దర్యాప్తు చేయలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget