అన్వేషించండి

YSRCP in Kothapet: కొత్తపేట వైసీపీ కోటగా ఎలా మారింది? ఈసారి చేజారిపోతుందా?

Kothapet Politics: కొత్తపేటలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ రాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ‌యం సాధించింది.

Kothapet Assembly Constituency: స్వాతంత్య్ర సమరయోధుడు కళా వెంకట్రావు ప్రాతినిథ్యం వహించిన కొత్తపేట నియోజకవర్గానికి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే ఓ ప్రత్యేకత ఉంది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక 1955లో కొత్తపేట నియోజకవర్గం ఏర్ప‌డింది.  అప్పటినుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ రాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ వస్తోంది.. కొత్తపేట నియోజకవర్గంలో చిర్ల కుటుంబం నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండగా టీడీపీ నుంచే చిర్ల సోమసుందర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు చిర్ల జగ్గిరెడ్డి 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 2014, 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.. 

వైసీపీ కంచుకోట బద్దలు అవుతోందా..
ఇటీవల భరోసా యాత్రలో భాగంగా రావులపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిర్ల జగ్గిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిల్లర జగ్గిరెడ్డి అంటూ సంభోదిస్తూ ఇసుక దోపిడీ చేస్తున్నారంటూ, కాంట్రాక్టులు తీసుకుని దోచేస్తున్నారని, భూ కజ్జాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.. 2014, 2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని సంపాదించిన జగ్గిరెడ్డి మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.. ఇప్పటికే టీడీపీ తరపున నియోజకవర్గ ఇంచార్జ్‌ బండారు సత్యానందరావు, జనసేన ఇంచార్జ్‌ బండారు శ్రీనివాసరావులు పోటాపోటీగా ఈసారి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఈసారి టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఏపార్టీ పోటీచేస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎవ్వరికి వారు తమ పని తాము చేసుకుపోతూ ప్రజల్లో తమ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు..

గెలుపుకోసం వ్యూహాలు.. సమీకరణాలు..
వైసీపీ గెలుపు కోసం ప్రభుత్వ విప్‌, కొత్తపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలుపు ద్వారా హ్యాట్రిక్‌ను సాధించాలని చిర్ల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇందుకోసమే వైసీపీకు సాంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న ఎస్సీ, బీసీ ఓటర్లుతో నిరంతరం టచ్‌లో ఉంటూ చెక్కుచెదరని ఓటుబ్యాంకుతో విజయం సాధించాలని పట్టుదలతో పనిచేసుకుపోతున్నారన్న ప్రచారం సాగుతోంది.. అయితే రావులపాలెంలో చోటుచేసుకున్న పలు వివాదాలు, అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా మోకాలడ్డారన్న ఆరోపణలు ఎస్సీ సామాజిక వర్గాన్ని కొంత వరకు చిర్ల జగ్గిరెడ్డికి దూరం చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా అంబేడ్కర్‌ చిత్రపటంతో ఉన్న పేపర్‌ ప్లేట్స్‌ వివాదంలో ఓ వర్గానికి కొమ్ముకాసి దళిత యువకులను తిరిగి జైల్లో పెట్టించారని ఆరోపణలు చిర్లపై తీవ్రంగా ఉన్నాయి.. ఇదే సమయంలో కాపు సాసమాజిక వర్గాన్ని కాపు కాసుకుంటూ అదే సమయంలో ఎస్సీ వర్గీయుల్లో  పట్టుసాధించాలన్న పట్టుదలతో బండారు సత్యానందరావు నిమగ్నమయ్యారన్నది కూడా వినిపిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన శాసన మండలి మాజీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి కూడా కోనసీమ ప్రాంతంలో టీడీపీ నుంచి కీలకంగా పనిచేస్తున్నారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం ద్వారా కూడా బీసీ వర్గం నుంచి టీడీపీకు అనుకూల ఓటు బ్యాంకు లభిస్తే ఇక టీడీపీ, జనసేన పొత్తుతో విజయం తథ్యం అన్న ధీమాతో రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.. 

కొత్తపేట నుంచి శాసన సభకు ప్రాతినిథ్యం వహించిన వారి జాబితా పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన చిర్ల జగ్గిరెడ్డి టీడీపీ అభ్యర్ధి బండారు సత్యానందరావుపై 2,271 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. పీఆర్పీ నుంచి బండారు సత్యానందరావు, కాంగ్రెస్‌ నుంచి చిర్ల జగ్గిరెడ్డి, టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం లు తలపడ్డారు. ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన బండారు సత్యానందరావు జగ్గిరెడ్డిపై 2,470 ఓట్లుతో గెలుపొందారు.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన సత్యానందరావుపై చిర్ల జగ్గిరెడ్డి 713 ఓట్లుతో గెలుపొందారు.  2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి సత్యానందరావు, జనసేన అభ్యర్ధి బండారు శ్రీనివాసరావులపై 4,038 ఓట్లు మెజార్టీ సాధించిన జగ్గిరెడ్డి విజయం సాధించారు. మొత్తం 2004 నుంచి పరిశీలిస్తే కొత్తపేటలో ఏ పార్టీకు అయినా స్వల్ప మెజార్టీ మాత్రమే లభిస్తుందన్నది తెలుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget