అన్వేషించండి

Godavari Floods: గోదావరికి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..ధవళేశ్వరం వద్ద 10 అడుగులకు నీటిమట్టం, లంక గ్రామాల ప్రజలకు ముప్పు!

Godavari Floods: ఎగువ నుంచి వెల్లువలా వ‌స్తున్న వ‌ర‌ద ఉద్ధృతికి భ‌ద్రాచ‌లం వ‌ద్ద 43 అడుగుల‌కు స్థాయి నీటిమ‌ట్టంకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Godavari Floods: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావ‌రి ఉగ్రరూపం దాల్చింది.. వెల్లువలా వ‌స్తున్న వ‌ర‌ద ఉద్ధృతికి భ‌ద్రాచ‌లం వ‌ద్ద 43 అడుగుల‌కు స్థాయి నీటిమ‌ట్టంకు చేరింది.. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇదే ఒర‌వ‌డి కొన‌సాగుతుండ‌గా ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద 10 అడుగుల స్థాయికి నీటిమ‌ట్టం చేరింది. దిగువ‌కు 7.57 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వ‌దులుతున్నారు అధికారులు. 
 
దిగువ‌నున్న గౌత‌మి, వ‌శిష్ట‌, వైన‌తేయ న‌దీపాయ‌లు ఉద్ధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలోని లంక గ్రామాల‌కు వెళ్లే కాజ్‌వేలు నీట మునుగుతున్నాయి. పి.గ‌న్న‌వ‌రం మండ‌ల ప‌రిధిలోని క‌న‌కాయిలంక కాజ్‌వే పైకి నీరు చేరింది. అదేవిధంగా సిద్ధాంతం త‌దిత‌ర ప్రాంతాల్లోని పుష్క‌ర‌ఘాట్లు నీట‌మునిగాయి. ఇదిలా ఉంటే శ్రీ‌రామ్‌సాగ‌ర్ ప్రాజెక్ట్‌కు వ‌ర‌ద ఉద్ధృతి కొన‌సాగుతోంది. ప్ర‌ధాన గేట్ల నుంచి 1.73 క్యూసెక్కుల వ‌ర‌ద‌నీటిని గోదావ‌రిలోకి వ‌దులుతున్నారు. ఇక గోదావ‌రికి వ‌ర‌ద ఉద్ధృతి పెరుగుతుండ‌డంతో కోటిప‌ల్లి, న‌ర్సాపురం పంటు దాటింపులు ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిలిపివేయాల‌ని ఇప్ప‌టికని ఇప్ప‌టికే కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.మ‌హేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. దిగువ లంక ప్రాంతాలు వ‌ర‌ద‌కు ముంపుకు గుర‌య్యే అవ‌కాశాలున్నందున అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అందుబాటులో ఉండాల‌ని ఆదేశాలు జారీచేశారు.

నీట మునిగిన క‌న‌కాయిలంక కాజ్‌వే..

పి.గ‌న్న‌వ‌రం మండ‌లం చాక‌లిపాలెంకు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా య‌ల‌మంచిలికి మ‌ధ్య ఉన్న క‌న‌కాయిలంక కాజ్‌వే గోదావ‌రి వ‌ర‌ద ఉద్థృతికి నీట మునిగింది. క‌న‌కాయిలంక- అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే చాక‌లిపాలెం మ‌ధ్య రాక‌పోక‌లు సాగించేందుకు ఈ కాజ్‌వే కీల‌కం కాగా అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ వ‌ద్ద దిగువ‌కు మ‌రింత వ‌ర‌ద నీరు వ‌దిలితే ఈ ప్రాంతం అంతా ముంపుకు గుర‌య్యే ప‌రిస్థితి ఉన్నందున అటు య‌ల‌మంచిలి, ఇటు పి.గ‌న్న‌వ‌రం త‌హసీల్దార్‌లు ఈప్రాంతాన్ని ప‌రిశీలించి ప‌డ‌వ‌ల‌ను ఏర్పాటు చేయించారు. పీహెచ్‌సీ ఆధ్వ‌ర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీచేశారు.

అవ‌స్థ‌లుతోనే ప‌డ‌వ ప్ర‌యాణం..

గోదావ‌రి వ‌ద‌ర పోటెత్తుతుంటే గోదావ‌రి లంక ప్రాంత ప్ర‌జ‌ల‌కు పాట్లు త‌ప్ప‌వు.. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో గౌత‌మి న‌ది, వ‌శిష్ట న‌దీప్ర‌వాహాల‌కు పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు లంక గ్రామాల ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు మొద‌ల‌య్యాయి..  పి.గ‌న్న‌వ‌రం మండ‌ల ప‌రిధిలో బూరుగులంక‌, అరిగిలెవారిపాలెం, ఊడిమూడిలంక‌, అయోధ్య‌లంక‌, త‌దిత‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు ఇంజ‌న్ ప‌డ‌వ‌ల్లో రాక‌పోక‌లు సాగిస్తున్నారు.
 
అయిన‌విల్లి మండ‌ల ప‌రిధిలో కూడా అయిన‌విల్లి లంక‌, వీర‌వ‌ల్లిపాలెం త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు క్ర‌మ‌క్ర‌మంగా చేరుతోంది.. గౌతమి న‌దీ తీరానికి ఆనుకుని ఉన్న‌టువంటి ముమ్మిడివ‌రం, ఐ.పోల‌వ‌రం మండ‌లాల్లోని ప‌లు లంక ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరుతోంది.. వ‌శిష్ట న‌దీపాయ‌కు ఆనుకుని ఉన్న‌టువంటి ప‌లు గోదావ‌రి న‌దీప‌రివాహ‌క ప్రాంతాల్లోను, వైన‌తేయ‌కు ఆనుకుని ఉన్న‌టువంటి అల్ల‌వ‌రం మండ‌ల ప‌రిధిలోకి వ‌చ్చే ప‌లు ప‌ల్లిపాలెం, రెబ్బ‌న‌ప‌ల్లి, గోపాయిలంక త‌దిత‌ర ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన ప‌దుచ్చేరిలోని వృద్ధ‌గౌత‌మి న‌దీపాయ‌కు ఆనుకుని ఉన్న ప‌లు మ‌త్స్య‌కార ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు..
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Dhurandhar Collection : 'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Embed widget