అన్వేషించండి

Eluru Acid Attack: ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు మృతి

యడ్ల ఫ్రాన్సిక ఈ నెల 13 తేదీ రాత్రి ఆమె పనిచేస్తున్న డెంటల్‌ క్లినిక్‌ నుంచి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటికి సమీపంలోనే కొందరు ఆమెపై యాసిడ్‌ పోశారు.

ఏలూరులో యాసిడ్ దాడికి గురైన మహిళ మరణించింది. ఫ్రాన్సిక అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం (జూన్ 20) కన్నుమూసింది. యడ్ల ఫ్రాన్సిక ఈ నెల 13 తేదీ రాత్రి ఆమె పనిచేస్తున్న డెంటల్‌ క్లినిక్‌ నుంచి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటికి సమీపంలోనే కొందరు ఆమెపై యాసిడ్‌ పోశారు. ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. ఈ కేసులో ఇప్పటికే బోడా నాగసతీష్‌, బెహర మోహన్‌, బూడిద ఉషాకిరణ్‌లను అరెస్టు చేశారు. మోహన్‌, ఉషాకిరణ్‌ల చేత యాసిడ్‌ను బోడా నాగ సతీష్‌ పోయించాడు.

ప్రమాదకరమైన యాసిడ్‌ను తన బంగారం పని అవసరం కోసం అని చెప్పి కొనుగోలు చేసి తీసుకువచ్చి నాగసతీష్‌కు విక్రయించిన ఏలూరు కత్తేపువీధికి చెందిన షేక్‌ ఖాజాబాబు (25)ను ఏలూరు దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యాసిడ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ఏలూరు గడియారస్తంభం ప్రాంతానికి చెందిన కిరాణాషాపు వ్యాపారి కోళ్ళ త్రివిక్రమరావు, అతడి గుమస్తా విదేలా సత్యనారాయణలను అరెస్టు చేశారు.

యాసిడ్ దాడి అనంతరమే ఏలూరులోని ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ తరలించారు. అయితే, ఆమె కంటిచూపు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న యడ్ల ఫ్రాన్సిక (35) అనే మహిళ భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ జరగడం వల్ల వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఫ్రాన్సిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారితోనే ఉంటుంది. రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్‌ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. అయితే, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ఆమెపై యాసిడ్‌ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది.

పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆమె చెల్లెలు యడ్ల సౌజన్య, తల్లిదండ్రులు ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన బట్టలు మార్చి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో విజయవాడకు తరలించారు.

ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్‌ కుమార్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో ఆసుపత్రికి చేరుకుని ఘటనా వివరాలు సేకరించారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో నగరంలోని సీఐలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి నిందితులను అరెస్టు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget