Weather Update: బంగాళాఖతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
రానున్న మూడు రోజులపాటు ఏపీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. రాగల 3 రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Daily weather report of Andhra Pradesh dated 27.10.2021 pic.twitter.com/M4uxQwmWEB
— MC Amaravati (@AmaravatiMc) October 27, 2021
యానాం, ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Synoptic features and weather warnings for next 5 days for Andhra Pradesh dated 27.10.2021. pic.twitter.com/sSw0Zrr0MZ
— MC Amaravati (@AmaravatiMc) October 27, 2021
దక్షిణ కోస్తాంధ్రాలో గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాయలసీమలో గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు.
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి