Raghurama : త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !
ఎంపీ పదవికి రాజీనామా చేసి అమరావతి ఎజెండాతో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో రఘురామకృష్ణరాజు ఉన్నారు. అనర్హతా వేటు ఎప్పట్లో వేయిస్తారో చెప్పాలని సొంత పార్టీ నేతలను సవాల్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలంతాఓ సారి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చి స్పీకర్‌కు విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారు. అయితే తాను పార్టీ ఫిరాయింపుకు పాల్పడనలేదని ఆయన కూడా రివర్స్‌లో స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయమూ రాలేదు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
మరో వైపు రఘురామపై అనర్హతా వేటు వేయించాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు వారికి చాలెంజ్ చేశారు. ఎంత కాలంలోపు అనర్హతా వేటు వేయిస్తారో చెప్పాలన్నారు. ఆ సమయం వరకూ చూసి తాను రాజీనామా చేస్తానన్నారు. ఆ తర్వాత నర్సాపురం నుంచి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలన్న ఎజెండాతో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షను తన ఉపఎన్నిక ద్వారా వ్యక్తం చేసేలాచూస్తానని స్పష్టం చేశారు.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు రాజీనామా అంశాన్ని తెరపైకి తేవడంతో వైఎస్‌ఆర్‌సీపీ అంతర్గత రాజకీయం మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అమరావతి ఎజెండాగా మళ్లీ పోటీ చేస్తానని రఘురామ చెబుతున్నారు కానీ ఏ పార్టీ అన్నది చెప్పడం లేదు. ఒక వేళ ఆయన బీజేపీలో చేరితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మరింతగా మారే అవకాశం ఉంది.
Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి