Somu Veerraju: చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు, వదిలేస్తారు.. ఇప్పుడు పవన్ కోసం..: సోము వీర్రాజు

శుక్రవారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కామెంట్స్‌ను ఎద్దేవా చేశారు. ఆయన అవకాశవాది అని అన్నారు.

FOLLOW US: 

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కామెంట్స్‌ను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. వదిలేస్తాడు.. ఆయన అవకాశ వాది. ఎవరినైనా ఏ సందర్భంలోనైనా లవ్ చేస్తాడు. తర్వాత ఆయన పాత్ర ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.’’ అని సోము వీర్రాజు మాట్లాడారు. 

Also Read: Raja Singh: కేసీఆర్ వారికి ఆ పనులు చేసే లైసెన్సు ఇచ్చారా? వనమా దొరకలేదని చెప్పడం సిగ్గుచేటు: రాజాసింగ్

‘‘1996లో కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టి చక్రం తిప్పిన మాహా చక్రవర్తి. అవకాశం వచ్చినప్పుడు పార్టీలతో జత కట్టి తర్వాత ఆయన తత్వం ఏంటో చూపిస్తారు. గతంలో మామ దగ్గర్నుంచీ భారతీయ జనతా పార్టీ వరకూ పొత్తు పెట్టుకొని ఆయన అంటే ఏంటో మీరు చూశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ప్రయత్నిస్తున్నారు. ఏ సందర్భంలోనైనా లవ్ చేయగల సామర్థ్యం చంద్రబాబుకు ఉంది.’’ అని సోము వీర్రాజు మాట్లాడారు.

Also Read: Crime News: మంటల్లో కాలిపోతున్న భర్త.. చోద్యం చూస్తూ నుంచున్న భార్య, కొడుకు.. అసలేం జరిగిందంటే..

నిన్న (జనవరి 6) చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జనసేనతో పొత్తు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా.. లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులా ఉండాల’ని వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చంద్రబాబు నేడు (డిసెంబరు 7) స్పష్టత ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు పుట్టుకొస్తాయి తప్ప.. సాధారణ పరిస్థితుల్లో రావు. అంతేకానీ, పొత్తుల వల్లే గెలుస్తామనే వైఎస్ఆర్ సీపీ నేతల మాటలు సరికాదని కొట్టిపారేశారు. వారికి ఏమీ తెలీదని, కొత్త బిచ్చగాళ్లంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఒక్క ఛాన్స్ అన్నారు.. మీకిచ్చిన అవకాశం అయిపోయింది. భవిష్యత్తులో మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.’’ అని చంద్రబాబు మాట్లాడారు.

Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...

Also Read: Chandrababu: వాళ్లు కొత్త బిచ్చగాళ్లు.. వన్ టైం ఛాన్సే ఇదీ, జనం తరిమి కొడతారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Jan 2022 01:44 PM (IST) Tags: Chandrababu AP BJP Chief somu veerraju Chandrababu Kuppam Tour alliances news in AP

సంబంధిత కథనాలు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య  కీలక వ్యాఖ్యలు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

Janasena On CM Jagan : రైతులను కులాల పేరిట విభజించిన ఘనత వైసీపీదే, చిత్తశుద్ధి ఉంటే ఆ నిబంధన తొలగించండి : నాదెండ్ల మనోహర్

Janasena On CM Jagan : రైతులను కులాల పేరిట విభజించిన ఘనత వైసీపీదే, చిత్తశుద్ధి ఉంటే ఆ నిబంధన తొలగించండి : నాదెండ్ల మనోహర్

Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, కొవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, కొవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్