అన్వేషించండి

Satyavedu: చిత్తూరు జిల్లాలో ఆసక్తికరం - సత్యవేడు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం

Chittor Politics: చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ ఆరుసార్లు టీడీపీ, ఐదుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి గెలిచారు.

Satyavedu Constituency Poltical History: చిత్తూరు (Chittor).. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది ఆధ్యాత్మికం. ఏడుకొండల వెంకటేశుడు సహా కాణిపాకం వినాయకుడు, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొలువైన జిల్లా. నిరంతరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ఈ జిల్లాలో రాజకీయాలు సైతం అంతే ఆసక్తిగా ఉంటాయి. చిత్తూరుకు తూర్పు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో కలిపారు. 2022, ఏప్రిల్ 4న పునర్వ్యవస్థీకరణ అనంతరం 31 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లతో ఉంది.

ఆరుసార్లు టీడీపీ విజయం

ఇక, ఈ జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గం సత్యవేడులో (Satyavedu) రాజకీయ ముఖచిత్రాన్ని ఓసారి చూస్తే ఇక్కడ 1962 నుంచి ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం మెజార్టీ విజయం సాధించి రికార్డు సృష్టించారు. 1962లో తొలిసారి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టి.బాలకృష్ణయ్య.. సమీప స్వతంత్ర అభ్యర్థి కె.మునిస్వామిపై 251 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కటారి మునిస్వామి.. కాంగ్రెస్ అభ్యర్థి టి.బాలకృష్ణయ్యపై 9,257 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 1972లో కాంగ్రెస్ తరఫున సి.దాస్ బరిలో నిలవగా.. తన సమీప ప్రత్యర్థి డీఎంకే పార్టీ అభ్యర్థి శిఖామణిపై 19,732 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత, 1978లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. జనతా పార్టీ అభ్యర్థి వై.గంగాధరంపై 12,427 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, 1983లో టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్.. కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్ గెలుపు జోరుకు బ్రేక్ వేశారు. ఆసారి 13,065 ఓట్ల మెజార్టీతో మనోహర్ గెలిచారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి వై.రామారావుపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్ పై 15,668 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక, 1994లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 29,005 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లోనూ టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 6,659 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2004 నుంచి..

ఇక, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కె.నారాయణ స్వామి.. టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ పై 31,492 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి హెచ్.హేమలత.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 9,691 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య.. వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం 4,227 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం.. టీడీపీ అభ్యర్థి జె.డి.రాజశేఖర్ పై 44,744 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. మరి, ఈసారి ఎన్నికల్లో సత్యవేడు ప్రజలు ఎవరికి పట్టం కడతారో.. ఏ పార్టీకి అండగా ఉంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.!

Also Read: Nellore News: నెల్లూరు జిల్లాలో విష జ్వరాల విజృంభణ - ప్రజల ఆందోళన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

ITI vs IIT Respect: ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
YS Sharmila: బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
CM Chandrababu: పంచాయతీల ఏకగ్రీవాలకు భారీ నజరానా.. రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం- సీఎం చంద్రబాబు
పంచాయతీల ఏకగ్రీవాలకు భారీ నజరానా.. రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం- సీఎం చంద్రబాబు
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget