AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

Vijayawada Drugs : విజయవాడలో డ్ర‌గ్స్ ర‌వాణా వ్య‌వ‌హ‌రం తీవ్ర స్దాయిలో దుమారాన్ని రేపడంతో ఈ వ్య‌వ‌హ‌రం పై విస్తృతంగా ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అదే స్దాయిలో చర్యలు తీసుకుంటున్నారు.

FOLLOW US: 

Vijayawada Drugs :  ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన అంశాలలో డ్రగ్స్ రవాణా, అక్రమ మద్యం, గంజాయి ఉన్నాయి. విజయవాడలో డ్ర‌గ్స్ ర‌వాణా వ్య‌వ‌హ‌రం తీవ్ర స్దాయిలో దుమారాన్ని రేపడంతో ఈ వ్య‌వ‌హ‌రం పై విస్తృతంగా ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అదే స్దాయిలో చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కొరియర్ వస్తుందా, అనుమానాస్పద పార్సల్స్ వస్తున్నాయా అనే కోణంలో నిఘా పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొరియ‌ర్ సంస్ద‌లు, అందులో ప‌ని చేసే సిబ్బంది పై కూడా పోలీసులు నిఘా పెట్టారు.

కొరియర్ ఆఫీస్ ప్రతినిధులు, సిబ్బందితో పోలీసులు ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతున్నారు. రాష్ట్రంలో కొరియర్ల ద్వారా యువత, కాలేజీ విద్యార్థులు మత్తు బారిన పడుతున్నారని వారికి అవగాహనా కల్పించారు పోలీసులు. మత్తు పదార్థాల అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకునే చర్యల్లో భాగంగా కొరియ‌ర్ సంస్ద‌లపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఇటీవ‌ల బెజ‌వాడ‌లో వెలుగు చూసిన కొరియర్ ఘ‌ట‌న‌లో పోలీసుల‌కు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హ‌రం వెలుగు చూసింది. 

కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, వాటి ద్వారా ఇతరుల పేర్లతో గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఇది రెగ్యూలర్ గా వచ్చే సాధారణ కొరియర్ పార్సల్స్ గా భావించి పోలీసులు ఇన్ని రోజలు ఈ కోణంలో నిఘా పెట్టలేదు. ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మత్తు పదార్ధాలను విదేశాలకు సైతం రవాణా చేస్తున్నారు. చివ‌ర‌కు అడ్ర‌స్ త‌ప్ప‌ని తేల‌టంతో క‌థ అడ్డం తిరిగి, నిషేదిత మ‌త్తు ప‌దార్థాల ర‌వాణా వ్య‌వ‌హ‌రం వెలుగు చూసింది. డ్రగ్స్ కొరియర్లతో బెజ‌వాడ ఒక్క సారిగా ఉలిక్కిప‌డింది.

పోలీసులు అప్రమత్తం..
శాంతి భ్రదతలకు భంగం వాటిల్లడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసు వారికి సవాల్ గా మారింది. విష‌యం బ‌య‌ట‌కు వెళ్లడంతో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి నిందితుల‌ను ప‌ట్టుకున్పప‌టికి, దేశ వ్యాప్తంగా విజయవాడలో డ్ర‌గ్స్ వ్యవహారం తెలిసిపోవడంతో మరోసారి ఏపీ హాట్ టాపిక్‌గా మారింది. 

కొరియర్ కొరియ‌ర్ సంస్ద‌ల్లో ప‌ని చేసే వారు ఈజీ మ‌నీకి అల‌వాటు ప‌డి అక్ర‌మ ర‌వాణాకు స‌హ‌క‌రిస్తున్నార‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యింది. దీంతో కొరియ‌ర్ సంస్ద‌ల్లో ప‌ని చేసే సిబ్బంది వివ‌రాల‌తో పాటుగా కొరియ‌ర్ ఇచ్చేందుకు వ‌చ్చే వారి వివ‌రాల‌ను పూర్తిగా సేక‌రించ‌టం ద్వారా నిషేధిత వ‌స్తువుల ర‌వాణాలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచించారు. ఇలాంటి విషయాల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని కొరియ‌ర్ సంస్ద‌ల‌కు పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

 Also Read: Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?

Published at : 20 May 2022 06:02 PM (IST) Tags: AP vijayawada DRUGS cannabis Courier

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: కర్నూలులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం, కిట్లు పంపిణీ చేస్తున్న సీఎం

Breaking News Live Telugu Updates: కర్నూలులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం, కిట్లు పంపిణీ చేస్తున్న సీఎం

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

No Admissions In Govt School: సీఎం రికమండేషనైనా చెల్లదు- ఆ ప్రభుత్వ బడిలో చేరాలంటే ఎంట్రన్స్ రాయాల్సిందే!

No Admissions In Govt School: సీఎం రికమండేషనైనా చెల్లదు- ఆ ప్రభుత్వ బడిలో చేరాలంటే ఎంట్రన్స్ రాయాల్సిందే!

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి

Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి