అన్వేషించండి

Pawan Kalyan Election Campaign: రేపట్నుంచి జనంలోకి జనసేనాని, పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Elections 2024: పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మార్చి 30న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు.

Pawan Kalyan Election Campaign Begins from Pithapuram: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇదివరకే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 27న మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రను మొదలుపెట్టారు. అదే రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు.

పిఠాపురంలో 5 రోజులు ప్రచారం..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నారని తెలిసిందే. సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్చి 30 (శనివారం) నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ ప్రచారం చేయనున్నారు. శనివారం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు రామాలయం వద్ద పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరి బహిరంగ సభకు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు కోరారు. వారాహి వాహనం నుంచి పిఠాపురం కేంద్రంగానే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనసేన నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో 5 రోజులు  పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు సొంత నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో పవన్ ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో పవన్ క్యాంపెయిన్ చేయనున్నారు. ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు. 
పవన్ తొలి విడత ప్రచార షెడ్యూల్
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురం
ఏప్రిల్ 3  - తెనాలి
ఏప్రిల్ 4 - నెల్లిమర్ల
ఏప్రిల్ 5 - అనకాపల్లి
ఏప్రిల్ 6  - యలమంచిలి
ఏప్రిల్ 7 - పెందుర్తి
ఏప్రిల్ 8  - కాకినాడ రూరల్
ఏప్రిల్ 10  - రాజోలు
ఏప్రిల్ 11 - పి.గన్నవరం
ఏప్రిల్ 12 - రాజా నగరం

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఏపీలో ఎన్నికలకు వెళ్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. వైనాట్ 175 అని ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మార్చి 16న దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని.. ఎవరైనా ప్రచారం చేశారని గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Embed widget