East Godavari Janasena : కాకినాడలో 3 రోజుల పాటు పవన్ మకాం - క్యాడర్‌కు పూర్తి స్థాయిలో ఎన్నికలకు రెడీ చేసే చాన్స్ !
Pawan Kalyan : కాకినాడలో పవన్ మూడు రోజుల పాటు మకాం వేసి ఎన్నికల సన్నద్ధతపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. పొత్తులో భాగంగా జనసేన ఉమ్మడి తూ.గో జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
Pawan Kalyan Election Preparations : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై దృష్టి సారించబోతున్నారు. కాకినాడలో ఆయన బస చేయబోతున్నారు. 27న కాకినాడ చేరుకోనున్న పవన్ 28,29, 30 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. గతంలో వారాహియాత్రను దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పవన్ పూర్తి చేశారు. అదే సమయంలో.. ఉమ్మడి తూ.గో జిల్లాలో జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే వాటిపై ఓ స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసుకుని.. కూటమి విజయానికి ఏం చేయాలన్నదానిపై వ్యూహ రచన చేసే అవకాశం ఉంది.
తూ.గో జిల్లాలో జనసేనకు ఎక్కువ స్థానాలు లభించే చాన్స్
గత అనుభవాలు, బలాలను దృష్టిలో పెట్టుకుంటే ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పోటీ చేస్తే క్లీన్ స్వీప్ చేయవచ్చన్న అంచనాలు జనసేన, టీడీపీ వర్గాల్లో ఉన్నాయి. అందుకే జనసేన పార్టీ చేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు… టీడీపీ పోటీ చేసే చోట్ల నేతలంతా సమన్వయంతో… పని చేసుకుని మంచి పలితాలు సాధించేలా అందరికీ దిశానిర్దేశం చేయాలని పవన్ అనుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన ఇప్పటికే అంతర్గత చర్చలు.. సర్వేల ద్వారా.. ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుందో ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలు - ఏబీపీ సీఓటర్ సర్వేలో వెల్లడి !
అభ్యర్థుల ఖరారుపైనా ఓ అంచనాకు రానున్న పవన్
జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఎక్కువ చాన్స్ లు ఉన్న చోట్ల పరిస్థితిపై అధ్యయనం చేయడం, నేతలకు కర్తవ్య బోధచేయడం.. చేరికలను ప్రోత్సహించడానికి పవన్ కాకినాడలో మూడు రోజుల పాటు మకాం వేస్తున్నట్లుగా ఉంది. జనసేనానికి రాజకీయం ఇప్పుడు పూర్తిగా వేరని.. ఆ పద్దతిలోనే రాజకీయం చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ పర్యటనలకు వచ్చే వారు ఒక్క శాతం అయితే.. బయటకు రాని వారు.. 90 శాతం ఉంటారని వారందరి చేతా ఓట్లు వేయించుకోవాలంటే.. సమైక్యంగా ఉండాలని అనుకుకుంటున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్ - మరి కలుస్తాయా ?
పొత్తులతో క్లీన్ స్వీప్ చేయాలన్న టార్గెట్‌తో టీడీపీ , జనసేన
గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్లాన్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి వారిని తెరపైకి తెస్తున్నారు. ఈ రాజకీయాలన్నింటినీ పవ్న ఎదురకోవాల్సి ఉంది. అందుకే పవన్ కల్యాణ్.. టీడీపీ, జనసేన పొత్తు వంద శాతం సఫలీకృతమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు రోజుల పర్యటనలో ఉత్తరాంధ్ర నుంచి పలువురు నేతలు జనసేనలో చేరేందుకు కాకినాడ వచ్చే అవకాశం ఉంది.