అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

NTR Coin : 28న రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ రూ. వంద నాణెం ఆవిష్కరణ - హాజరు కానున్న అన్నగారి కుటుంబం !

ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి కుటుంబం మొత్తం హాజరు కానుంది. తననూ ఆహ్వానించాలని లక్ష్మిపార్వతి రాష్ట్రపతికి లేఖ రాశారు.

 

NTR Coin :  నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా  28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరు కానున్నారు.  ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరు కావడం లేదు. 

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.                    

27 సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న  చంద్రబాబు 28వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో  సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా అందుకు తగిన సాక్ష్యాధారాలను సైతం ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని, ఈ అంశాన్ని సైతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్లనున్నారు. అలాగే ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు.          

మరో వైపు తాను తాను ఎన్టీఆర్ భార్యనని..   ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తననూ ఆహ్వానించాలని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని లేఖలో లక్ష్మీపార్వతి కోరారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో తన పేరునూ చేర్చాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ తన భర్త అని, తన భర్త పేరుపైన నాణెం విడుదల చేస్తూ తనకు ఆహ్వానం పంపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అధికారుల తొందరపాటు కారణంగా ఈ తప్పు జరిగి ఉండవచ్చని, తప్పును వెంటనే సరిదిద్దాలని కూడా లక్ష్మీపార్వతి లేఖలో పేర్కొన్నారు.                        

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Embed widget