By: ABP Desam | Updated at : 04 Aug 2021 02:14 PM (IST)
అమరావతి ఫైల్ ఫోటో
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పుడల్లా ఉండదని కేంద్ర ప్రభుత్వం మరోసారి చాలా స్పష్టంగా తెలిపింది. విభజన చట్టం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారని లోక్‌సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాలను 175 నుంచి 225 కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచేందుకు పరిశీలన చేయాలని ఉంది. కానీ ఖచ్చితంగా పెంచాలని లేదు.
ఇక్కడే అసలు సమస్య వచ్చింది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండా సీలింగ్ పెట్టారు. అందుకే అసెంబ్లీ సీట్లను పెంచాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. శాసనసభ స్థానాల పెంచాలంటే ఆర్టికల్ 170 (3)ను సవరించాలని, అందుకే అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ 2026వరకు సాధ్యం కాదని కేంద్రం గతంలోనే పార్లమెంట్ లో చెప్పింది. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అని.. తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు.. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తీవ్రంగా పట్టుబట్టాయి. ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ నేతలు.. ఇందు కోసం తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. కానీ రాజ్యాంగ సవరణ చిక్కులతో ఎక్కడిదక్కడ ఉండిపోయింది.
మారిన రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని అవరూ అనుకోవడంలేదు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రెండూ... సీట్ల పెంపు గురించి ఆలోచించడమే మానేశాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రశ్న ద్వారా అడగడంతో కేంద్రం సూటిగా సమాధానం చెప్పింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం నిర్ణయించింది. జమ్మూ కశ్మీర్‌లో సీట్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకే ఇటీవల కశ్మీర్ నేతలందర్నీ పిలిచి మోడీ సమావేశం నిర్వహించారు. అయితే కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి రాజ్యాంగసవరణ చేయాల్సిన అవసరం లేదు. అయితే వాటితో పాటే తెలుగు రాష్ట్రాల్లోనూ డీమిలేటేషన్ చేస్తారన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఆ ప్రచారానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సమాధానం చెక్ పెట్టినట్లయింది.
నియోజకవర్గాల పెంపు హామీ విభజన చట్టంలో ఉందని దాన్ని నెరవేర్చకపోతే ఎలా అనికొంత మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే విభజన చట్టంలో ఏదీ ఖచ్చితంగా చేయాలని పెట్టలేదు. పరిశీలించాలి.. అధ్యయనం చేయాలి అని మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా.. ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్‌విభజన చేయాల్న రూలేమీ లేదు.
Vijayamma To YSRCP Plenary: వైసీపీ ప్లీనరికి విజయమ్మ వస్తారా? లేదా? జగన్ పాలనపై ఆమె ఏమంటారు?
YSRCP Plenary Schedule: రేపే వైసీపీ ప్లీనరీ, అధికారంలోకొచ్చాక తొలిసారి - మొదటిరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదీ
Chintamaneni Prabhakar: పటాన్ చెరులో జోరుగా కోడి పందేలు, పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని! 21 మంది అరెస్టు
Weather Updates: నేడు ఈ 6 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ - మిగతా చోట్ల ఎల్లో అలర్ట్
Petrol-Diesel Price, 7 July: షాక్! నేడు దాదాపు అన్ని చోట్లా పెట్రో, డీజిల్ ధరలు పైపైకి - ఇక్కడ మాత్రం స్థిరం
Ilaiyaraaja-Vijayendraprasad: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పీటీ ఉష!
Karimnagar Bear: కరీంనగర్లో మళ్ళీ ఎలుగుబంటి దడ! సవాలుగా మారిన సమస్య, అధికారులు ఉరుకులు పరుకులు
Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్
Bandi Vs KCR : తెలంగాణలో "లెక్క"లు మారుతాయా? ఎవరి అవినీతి ఎవరు వెలికి తీస్తారు?