అన్వేషించండి

NGRI: అనంత‌పురం జిల్లాలో అరుదైన ఖ‌నిజ నిక్షేపాలు- ఫోన్లు, కార్ల‌లో వాటిదే కీల‌క పాత్ర‌

NGRI: అనంత‌పురం జిల్లాలో 15 విశిష్ట ఖనిజాలను గుర్తించారు. ఇవి సెల్‌ఫోన్‌ల నుంచి టీవీల వరకు అనేక వస్తువులలో ఉపయోగిస్తారని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

NGRI: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరుదైన, విలువైన ఖ‌నిజ సంప‌ద‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.. అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో ఎంతో విలువైన 15 విశిష్ట ఖనిజాలను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. తాజాగా గుర్తించిన‌ ఖనిజ లవణాలు ప్రజలు రోజువారీ అవ‌స‌రాలైన సెల్‌ఫోన్‌ల నుంచి టీవీల వరకు అనేక వస్తువులలో ఉపయోగిస్తారని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా కార్లు, ఆటోమొబైల్‌ పరిశ్రమల్లోనూ వీటిని వినియోగిస్తార‌ని తెలిపారు.

అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో సైనైటిస్ వంటి సాంప్రదాయేతర శిలలపై నేష‌న‌ల్ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  పరిశోధనలు నిర్వహించిన క్రమంలో 15 అరుదైన‌, విశిష్టమైన ఖనిజ లవణాలను గుర్తించింది. శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న సమయంలో లాంథనైట్ సిరీస్‌లోని పలు మూలకాలు, ఖనిజ లవణాలు వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు గుర్తించిన వాటిలో సెరియేట్, థోరైట్, అల్లనైట్, టాంటలైట్, కొలంబైట్, అపటైట్, మోనజైట్, పైరోక్లోర్ యూక్జెనైట్, ఫ్లోరైట్, జీర్కోన్ వంటి ఖనిజ లవణాలు ఉన్నాయ‌ని తెలిపారు. వీటితోపాటు అక్కడ రేడియో యాక్టివ్ మూలకాలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అనంతపురం జిల్లాలో 15 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (REE)కి చెందిన భారీ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు ఇవి అనేక రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ ,శాశ్వత అయస్కాంతాల తయారీతోపాటు, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌లో కీలక భాగమైన విండ్ టర్బైన్లు, జెట్‌ ఎయిర్ క్రాఫ్ట్ సహా అనేక ఇతర రంగాలలో వీటిని వాడతారని చెబుతున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని దంచర్ల, పెద్దవడుగూరు, దండువారిపల్లి, రెడ్డిపల్లి చింతల్ చెరువు, పులికొండ కాంప్లెక్స్ ఈ ఖనిజాలకు కేంద్రాలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింత లోతుగా ఇక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వెల్ల‌డించారు. 

ఈ పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్త పీవీ సుందర్ రాజు.. రెడ్డి పల్లె, పెద్దవడుగూరు ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టామని, అక్కడే జిర్కోన్ పలు రూపాలలో లభ్యమైందని తెలిపారు. మోనజైట్ గింజల రూపంలో, పలు రంగులలో కనిపించిందని వెల్ల‌డించారు. ఇది రేడియోధార్మిక మూలకాల ఉనికిని సూచిస్తోందని ఆయన తెలిపారు. ఇక్కడ ఉన్న REE సామర్థ్యాన్ని అంచ‌నా వేయ‌డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 300 నమూనాలను సేకరించామని, మరింత జియో కెమికల్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి మరింత తెలుసుకోవడానికి డీప్‌ డ్రిల్లింగ్ ద్వారా మరిన్ని లోతుగా అధ్యయనాలు నిర్వహించడానికి సైంటిస్టుల బృందం సిద్ధమవుతోంది. ఈ మూలకాలు క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, శాశ్వత అయస్కాంతాల తయారీలో కూడా ఉపయోగించబడతాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాటి ప్రకాశించే, ఉత్ప్రేరక లక్షణాల కారణంగా అధిక సాంకేతికతలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఆల్కలీన్ సైనైట్‌లో మెటలోజెని కోసం చిక్కులతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను శాస్త్ర‌వేత్త‌లు అంచనా వేస్తున్నారు. మెటలోజెని అనేది ఒక ప్రాంతం భౌగోళిక చరిత్ర. దాని ఖనిజ నిక్షేపాల మధ్య జన్యు సంబంధాన్ని వివరించే భూగర్భ శాస్త్రంలోని శాఖ. ఆల్కలీన్ కాంప్లెక్స్‌లు అనంతపురం జిల్లాలోని పాలియోప్రొటెరోజోయిక్ కడప బేసిన్‌కు పశ్చిమ, నైరుతి దిశలో ఉన్నట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Embed widget