Nellore Corporation:అరగుండు.. అరమీసం.. ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేత వింత నిరసన...
నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ అక్రమంగా గెలుచుకుందని... ఓటర్లను, నాయకులను ప్రలోభ పెట్టిందని ఆరోపిస్తోంది టీడీపీ. ఇవే ఆరోపణలతో ఆ పార్టీ నేత ఒకరు వినూత్నంగా నిరసన తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏక మొత్తంగా 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అస్సలు ఛాన్సే లేకుండా చేసింది. అయితే వైసీపీ అక్రమాలతో ఈ ఎన్నికల్లో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 49, 50వ డివిజన్లలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు వింత నిరసనకు దిగారు.
అరగుండు.. మెడలో పలక..
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు అరగుండు గీయించుకున్నారు, అరమీసం తీయించుకున్నారు. ఈ వింతైన వేషంతోపాటు.. మెడలో పలక తగిలించుకున్నారు. జగన్ పోవాలి, బాబు రావాలి అంటూ దానిమీద రాసుకున్నారు. మంత్రి, ఆయన అనుచరులు, ఇతర నాయకులు టీడీపీ ఓటమికోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారాయన.
ఎంతకాలం ఈ దీక్ష..
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ దీక్షలో ఉంటానని ప్రకటించారు టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు. మొత్తమ్మీద నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత టీడీపీ చేపట్టిన ఈ నిరసన సంచలనంగా మారింది. అరగుండు, అరమీసంతో టీడీపీ నాయకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకుల తీరు మారాలని, ఏకపక్షంగా ఎన్నికలు జరిపారని అన్నారాయన.
Also Read: వైఎస్ఆర్సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !
Also Read: మినీ లోకల్ వార్‌లో వైఎస్ఆర్‌సీపీ హవా .. ఉనికి చాటుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే !
Also Read: వైఎస్ఆర్‌సీపీ - 19 , టీడీపీ - 6 .... కుప్పంలో జెండా పాతిన అధికారపార్టీ !
Also Read: 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు
Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్
Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్
Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'
Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?