అన్వేషించండి

ఒక హత్య,100 అనుమానాలు- ప్రకాశం జిల్లా పోలీసులకు ఛాలెంజింగ్‌గా మారిన రాధ మర్డర్ కేస్‌

హత్య జరిగి రెండురోజులవుతున్నా ఇంతవరకు అనుమానితులు చిక్కలేదు. పోలీసులు కూడా వారిని ట్రేస్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. 

ప్రకాశం జిల్లాలో రాధ అనే వివాహిత హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. బాకీ డబ్బు తిరిగిస్తానని చెప్పి స్నేహితుడు ఫోన్ చేయడంతో వెళ్లిన ఆమె తిరిగి శవమై కనపడింది. అయితే ఆమె ఒంటరిగా ఎందుకు వెళ్లింది, అక్కడ ఏం జరిగింది..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

అసలేం జరిగింది..?
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకి చెందిన రాధ ఇటీవల అర్థరాత్రి ఇంటినుంచి వెళ్లి శవమై తేలింది. రాధ కుటుంబం నుంచి 80లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీనిపై విచారణ ప్రారంభించారు పోలీసులు. రాధ మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. 

హత్యాచారం..?
రాధ మృతదేహంపై తీవ్ర గాయాలు ఉండటం ఆ తర్వాత ఆమెను వాహనాలతో తొక్కించిన ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమెను క్రూరంగా హింసించినట్టు గుర్తించారు. కేవలం అప్పు వసూలు విషయంలో అవమానం పొందిన వ్యక్తి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది. అందులోనూ రాధ ఇద్దరు పిల్లల తల్లి. ఆమెపై అత్యాచారం చేయాల్సిన అవసరం నిందితుడికి ఎందుకు ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాధ మృతిని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు మాత్రం తెలుస్తోంది. 

తెలంగాణ నుంచి రాధ తన ఇద్దరు పిల్లలతో సొంత ఊరు రావడం, గ్రామంలో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే క్రమంలో ఇలా ఇంటినుంచి వెళ్లిపోయి శవంగా తిరిగి రావడం జిల్లాలో సంచలనంగా మారింది. కేవలం బాకీ తీర్చే ఉద్దేశం లేక రాధను కాశిరెడ్డి హత్య చేశాడా, లేక ఇంకేమైనా కారణం ఉందా అనేది తేలడంలేదు. హత్య జరిగి రెండురోజులవుతున్నా ఇంతవరకు అనుమానితులు చిక్కలేదు. పోలీసులు కూడా వారిని ట్రేస్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. 

మరోవైపు రాధ కుటుంబం, పోలీసుల తీరుపై ఆరోపణలు చేస్తోంది. రాధ మిస్సైందన్న ఫిర్యాదు తర్వాత పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి ఉంటే రాధ బతికి ఉండేదని అంటున్నారు. రాధ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె జిల్లెళ్లపాడు సమీపంలోనే ఉందని పోలీసులు చెప్పారు. దీంరో రాధ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లడంతో ఆమె శవమై కనపడింది. 

రాధ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ఏపీతోపాటు, తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాలకు పోలీసు ప్రత్యేక బృందాలను పంపినట్టు కనిగిరి డీఎస్పీ రామరాజు తెలిపారు. రాధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేతిరెడ్డి కాశిరెడ్డిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతి చెక్‌ పోస్ట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాశిరెడ్డితో పాటు, మరో నలుగురు ఈ హత్యోదంతంలో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారా.. లేక తీసుకున్న అప్పు అడుగుతుందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కాశిరెడ్డి స్నేహితులు, బంధువులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపబుతున్నారు పోలీసులు. 

Also Read: వంతెనపై పొక్లెయినర్‌తో పనులు, ఒక్కసారిగా కూలిన వంతెన, ప్రాణాలతో బయటపడ్డ ఆపరేటర్!

Also Read: వైనతేయ వంతెనపై యువకుడు ఆత్మహత్యా యత్నం - కాపాడిన లారీ డ్రైవర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Embed widget