Konaseema News: వైనతేయ వంతెనపై యువకుడు ఆత్మహత్యా యత్నం - కాపాడిన లారీ డ్రైవర్
Konaseema News: వైనతేయ వంతెన పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే విషయం గుర్తించిన లారీ డ్రైవర్ తాడు విసిరి మరీ అతడి ప్రాణాలను రక్షించాడు.

Konaseema News: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయాడు. వైనతేయ వంతెన పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోబోగా.. అది గమనించిన ఓ లారీ డ్రైవర్.. నదిలోకి తాడు విసిరి మరీ అతడిని కాపాడాడు.
కొన్ని సంఘటనలు సినీ ఫక్కీలో జరుగుతుంటాయి. క్షణికావేశంలో నదిలో దూకి ఆత్మహత్యాయత్నాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని అటువైపుగా వెళ్తున్న లారీ డ్రైవర్ పగ్గం తాడు విసిరి కాపాడాడు. పాశర్లపుడి - బోడసకుర్రు వద్ద వైనతేయ నదీపాయపై ఉన్న వంతెన నుంచి నదిలోకి దూకి ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో వంతెన పైనుంచి యువకుడు దూకిన దృశ్యాన్ని చూసిన పలువురు కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారంతా నిస్సహాయ స్థితిలో ఉండిపోగా.. అటువైపుగా వెళ్తున్న లారీ డ్రైవర్.. లారీ ఆపాడు. తన వద్దనున్న పగ్గం తాడును విసిరి సదరు యువకుడిని కాపాడాడు. అతడు నదిలోకి తాడు విసరగానే.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు తాడును పట్టుకున్నాడు. వెంటనే మత్స్యకారులు పడవల్లో వెళ్లి సదరు యువకుడిని కాపాడారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ యువకుడు సురక్షితంగా బ్రతికి బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు. అయితే నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు అమాలపురంలోని నారాయణపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అంతేకాకుండా అతడు ప్రస్తుతం అమలాపురం పట్టణంలోనే ఓ ప్రైవేటు కాలేజీ చదువుతున్నాడని.. కానీ ఆత్మహత్యకు ఎందుకు ఇంకా తెలియదు.
హైదరాబాద్ లోనూ గతనెల ఇలాంటి ఘటనే
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న దుర్గం చెరువు వద్ద టెన్షన్ నెలకొంది. శనివారం ఓ వ్యక్తి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. లేక్ పోలీసులు రంగంలోకి దిగారు. రెస్క్యూ టీమ్ తో కలిస లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. DRF స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ ఈ ఘటనపై స్పందించారు. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకేశాడు. DRF సిబ్బంది ఆ వ్యక్తి డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు. రెండున్నర గంటల సమయంలో DRF కంట్రోల్ రూమ్ కి సమాచారం అందినట్లు తెలిపారు. మృతుడి వయసు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుంది. రెండు DRF టీమ్స్, రెండు బోట్స్ 12 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మృత దేహం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా బాడీని వెలికి తీస్తామని DRF స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ చెప్పారు. ఇందులో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇప్పటి వరకు దుర్గం చెరువో నాలుగైదు డెడ్ బాడీలు వెలికి తీశామని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

