Konaseema Bridge Collapsed: వంతెనపై పొక్లెయినర్‌తో పనులు, ఒక్కసారిగా కూలిన వంతెన, ప్రాణాలతో బయటపడ్డ ఆపరేటర్!
Konaseema Bridge Collapsed: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ వంతెనను కూల్చేందుకు పొక్లెయినర్‌తో పనులు చేయిస్తున్నారు. ఒక్కసారిగా వంతెన కుప్పకూలగా.. ఆపరేటర్ సహా పొక్లెయిన్ కూడా కిందపడిపోయింది.
Konaseema Bridge Collapsed: కొన్ని అనాలోచినతమైన పనులు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. కొన్ని సార్లు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడినా మరికొన్ని సార్లు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం యెంట్రుకోనలో శుక్రవారం రోజు అనుకోని ఓ ప్రమాదం చోటుచేసుకుంది. అసలే శిథిలావస్థలో ఉన్న వంతెన. దాన్ని కూల్చేందుకు దానిపైనే పొక్లెయినర్ ఉంచి కూల్చే ప్రయత్నం చేశారు. అది కాస్తా బెడిసి కొట్టింది. ఒక్కసారిగా వంతెన శ్లాబ్ కుప్పకూలిపోవడంతో దానిపైన ఉన్న పొక్లెయినర్, అందులో ఉన్న ఆపరేటర్ కూడా పంటకాలువలో బోల్తా కొట్టారు. అయితే అదృష్ట వశాత్తు ఆపరేటర్ ప్రాణాలతో బయట పడ్డాడు.
గుడ్డివాని చింత నుంచి దేవగుప్తం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. యెంట్రుకోనలో పంట కాలువపై వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆ వంతెనను తొలగించి నూతన నిర్మాణం చేపట్టేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వంతెనను 200 సామర్ధ్యం గల పొక్లైన్‌తో కూల్చే పనులను శుక్రవారం ప్రారంభించారు.
వంతెనపై పొక్లెయినర్ ఉంచి కూల్చుతుండగా ఒక్కసారిగా వంతెన శ్లాబ్ విరిగి పడింది. దీంతో వంతెనపై ఉన్న పొక్లెయినర్ ఒక్కసారిగా శ్లాబ్ మద్యలోకి విరిగి కూలిపోయింది. దీంతో వంతెనపై ఉన్న పొక్లెయినర్ కాలువలోకి బోల్తా కొట్టింది. పొక్లైన్ ఆపరేట్ చేస్తున్న డ్రైవర్ అందులోనే ఉండగా స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.