By: ABP Desam | Updated at : 21 Apr 2022 10:29 AM (IST)
కానిస్టేబుల్ కారు తీసుకెళ్లడంతో రోడ్డున పడ్డ ఫ్యామిలీ
ఒంగోలులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. తిరుమల వెళ్తున్న వ్యక్తుల నుంచి వెహికల్ లాక్కొని.. ఓ ఫ్యామిలీని రోడ్డున పడేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తోంది. ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్నోవా కారులో బయల్దేరారు. రాత్రి పది గంటలకు ఒంగోలులోని ఓ హోటల్ ముందు ఆపారు.
ఒంగోలులో టిఫిన్ చేస్తుండా ఓ కానిస్టేబుల్ వచ్చాడు. ఈ వెహికల్ ఎవరిదని అడిగాడు. మాదే అని చెప్పాడు శ్రీనివాస్. 22న సీఎం జగన్ పర్యటన ఉందని.. సీఎం కాన్వాయ్ కోసం వెహికల్ కావాలని చెప్పారు. డ్రైవర్ కూడా కావాలని గద్దించారు.
తామంతా తిరుపతి వెళ్తున్నామని ఇప్పుడు కష్టమనిన చెప్పినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు చెప్పారని... సారీ అంటూ వెహికల్ తీసుకెళ్లిపోయాడా కానిస్టేబుల్.
పోలీసు కానిస్టేబుల్ కారు తీసుకెళ్లిపోవడంతో శ్రీనివాస్ ఫ్యామిలీ రోడ్డున పడింది. అర్థరాత్రివేళలో ఇదేంపని అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం కోసం వెహికల్స్ కావాలంటే స్థానికంగా ఉన్న వారివి తీసుకోవాలే కానీ... ఇలా దూర ప్రాంతాల వారిని టార్గెట్ చేయడమేంటని వాపోయింది.
దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు... ఇలాంటి సంఘటన జరిగినట్టు తమ దృష్టికి రాలేదని... కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు లోకల్ వెహికల్స్ మాత్రమే తీసుకుంటామన్నారు.
ఇలా ఫ్యామిలీని నడిరోడ్డుపై వదిలేసి వెహికల్ తీసుకెళ్లిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్ళడం దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు.
కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణమని.. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారని నిలదీశారు.
సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళిందా అని ఆశ్చర్యపోయారు చంద్రబాబు . ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారన్నారు.
సిఎం వస్తే షాప్స్ మూసెయ్యడం... సిఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు.
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్లో జేఎన్టీయూ అనంతపురం సత్తా
AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు
Breaking News Live Telugu Updates: ఏపీలో 12 రోజులు దసరా సెలవులు
జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు
Top Headlines Today: చంద్రబాబు తప్పు చేయరంటున్న రవిబాబు- తెలంగాణలో బేరాల్లేవమ్మా అంటున్న కాంగ్రెస్- నేటి టాప్ న్యూస్
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Vasireddy Padma : ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్ను నా రూమ్కు పిలిచి నిద్రపోయా
బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు
/body>