By: ABP Desam | Updated at : 22 Jan 2022 03:09 PM (IST)
మధ్యాహ్నం హత్యలు
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో తల్లీ, కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు. రబ్బానీ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతురాలు మీరాబీ కుమార్తె నూర్జహాన్ తో రబ్బానీకి అక్రమ సంబంధం ఉంది. నూర్జహాన్ భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో రబ్బానీతో అక్రమ సంబంధం మొదలైంది. వారిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉన్నాడు. ఇద్దరూ కావలిలో కలసి ఉండేవారు. ఆ తర్వాత రబ్బానీతో కూడా నూర్జహాన్ గొడవపడింది. అతడిని కూడా వదిలేసి అమ్మ దగ్గరకు వచ్చేసింది. కలిగిరి మండలం అమ్మటివారి పాలెంలో తల్లి మీరాబీ, తమ్ముడు అలీఫ్ తో కలసి ఉంటోంది. అమ్మ దగ్గరే ఉంటూ తనకు తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది నూర్జహాన్. ఈ క్రమంలో తనతోపాటు కలసి ఉన్న రబ్బానీని దూరం పెట్టింది.
అయితే నూర్జహాన్ ని భార్యగా భావించి ఆమెతోనే ఉంటున్న రబ్బానీకి ఇది నచ్చలేదు. తనని కాదని తల్లి దగ్గరకు వెళ్లే సరికి నూర్జహాన్ పై కక్ష పెంచుకున్నాడు రబ్బానీ. అంతే కాదు.. ఆమెకు రక్షణ ఇచ్చిన ఆమె తల్లి, తమ్ముడిపై కూడా పగ పెంచుకున్నాడు. కావలి నుంచి అమ్మటివారి పాలెంకు వచ్చిన రబ్బానీ నేరుగా నూర్జహాన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె లేకపోయే సరికి ఆమె తల్లి, తమ్ముడితో గొడ పడ్డాడు. నూర్జహాన్ ని తనతో పంపించేయాలని అన్నాడు. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. తిరస్కరించారు. ఆమె బతుకు ఆమెని బతకనివ్వాలని, ఒత్తిడి తేవద్దని కోరారు. తనతోపాటు కత్తిని కూడా తెచ్చుకున్న రబ్బానీ, కోపంలో మీరాబీని విచక్షణారహితంగా నరికేశాడు. అడ్డం వచ్చిన ఆమె కొడుకు అలీఫ్ ని కూడా కత్తితో గాయపరిచాడు. దీంతో వారిద్దరూ రక్తపుమడుగులో పడి చనిపోయారు.
మధ్యాహ్నం సమయంలో ఈ హత్యలు జరగడంతో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. జంట హత్యల విషయంపై పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టారు. సీఐ సాంబశివరావు, ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. హంతకుడు అప్పటికే అక్కడినుంచి పారిపోయాడు.
రబ్బానీ వారిద్దరినీ హత్యచేశాడని ప్రత్యక్ష సాక్షుల నుంచి తెలుసుకున్నామని చెప్పారు కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్. రబ్బానీకోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు జరగలేదు. ఒకేరోజు తల్లీ కొడుకు, అదీ వారి సొంత ఇంటిలోనే హత్యకు గురికావడం, పట్ట పగలు హంతకుడు ఎవరికీ దొరక్కుండా పారిపోవడంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. హంతకుడికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల