Gudivada Casino : ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !
గుడివాడ కేసినో వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. కేసినో నిర్వహించామని ఓ సంస్థ వీడియోలతో సహా చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ నేతలు బయట పెట్టారు.
సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణమండపంలో కేసినో నిర్వహించిన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !
అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. విజయవాడలో కేసినో నిర్వహణ మొత్తం నిపుణులైన వారు నిర్వహించారు. ఆ సంస్థ యాసెస్ కాసినోగా టీడీపీ ప్రకటించారు. కేసినో నిర్వాహకులు పెట్టిన మీడియా పోస్టులను వాటి లింక్‌లను విడుదల చేశారు. యాసెస్ కాసినో అనే కంపెనీ గుడివాడలో తాము మూడు రోజుల పాటు కేసినో నిర్వహించామని సంక్రాంతి పండుగ అయిన పదిహేనో తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
https://www.facebook.com/acescasinoindia/videos/374967331059318/?extid=NS-UNK-UNK-UNK-IOS_GK0T-GK1C
అలాగే ఈ యాసెస్ కేసినో నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ప్రిమాల్ టోపీవాలా అనే వ్యక్తి పెట్టి సోషల్ మీడియా పోస్టును కూడా టీడీపీ మీడియాకు రిలీజ్ చేసింది.
https://www.facebook.com/100006434116035/posts/3771984146359352/
ఆ రెండు వీడియోల్లో గుడివాడలో తాము మూడు రోజుల పాటు కేసినో నిర్వహించామని వారు తెలిపారు. ఈ ఆధారాలతో తాము డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. గుడివాడలో కేసినో నిర్వహించారని రుజువు చేశామని పెట్రోల్ రెడీ చేశామని టీడీపీ సోషల్ మీడియా విభాగం కొడాలి నానికి ఉద్దేశించి పోస్ట్ పెట్టింది.
https://www.facebook.com/113225357041804/posts/514212936943042/
ఈ ఆధారాలపై వైఎస్ఆర్‌సీపీ నేతలు.. మంత్రి కొడాలి నాని స్పందించాల్సి ఉంది. కేసినో జరిగిందని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుంటానన్న కొడాలి నాని సవాల్‌ను టీడీపీ నేత బొండా ఉమ స్వీకరించారు. తాను నిరూపిస్తానని... నిరూపించలేకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానన్నారు. చెరో పెట్రోల్ డబ్బా తీసుకుని తేల్చుకుందామని సవాల్ చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి