News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

ఇద్దరు వైసీపీ ఎంపీలు రఘురామ, విజయసాయి రెడ్డి మధ్య ట్వీట్ల రచ్చ నడుస్తోంది. ఒకర్నొకరు ట్విటర్ వేదికగా బహిరంగంగా ఎగతాళి చేసుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మె్ల్యే రఘురామకృష్ణ రాజు, మరో ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. గురువారం మధ్యాహ్నం విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌తో మొదలైన ఈ ట్వీట్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం సైతం ఇరువురూ ట్విటర్ వేదికగా పరస్ఫర విమర్శలు చేసుకున్నారు.

గురువారం (జనవరి 20) ఎంపీ విజయసాయి రెడ్డి.. రఘురామను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. ‘‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా!  ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు...నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!’’ అని ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన రఘురామకృష్ణ రాజు.. ‘‘ఆవునా? నా జీవితం నీకు ఏ1 కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు పాపం వివేకానంద రెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది Mr. ఏ2!’’ అని బదులిచ్చారు.

మళ్లీ శుక్రవారం (జనవరి 21) మధ్యాహ్నం రఘురామ లక్ష్యంగా విజయసాయి రెడ్డి మరో రెండు ట్వీట్లు కాస్త ఎద్దేవా చేస్తూ.. ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ళకు  ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్ళే రాళ్లతో కొడతారు.’’

విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేసిన కాసేపటికే రఘురామ కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో.’’ అని కౌంటర్ ఇచ్చారు. 

దీనికి బదులుగా విజయసాయి మరో ట్వీట్ వదిలారు. ‘‘మా చిన్నప్పుడు అటు వెళ్లకండిరా బూచోడున్నాడు అని హెచ్చరించేవారు పెద్ద వాళ్లు. బూచోడంటే మతిస్థిమితం లేనివాడని, రాళ్లు విసురుతాడని భయపడేవాళ్లం. ఇప్పుడు రాజా వారిని కూడా అందరూ అలాగే అనుకుంటున్నారు. పరువు తీస్తున్నాడని బంధువులు, కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదట. ఏం ఖర్మ!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై రఘురామ ఎలా స్పందిస్తారనేది చూడాలి.

Also Read: Gudivada : గుడివాడలో టీడీపీ వర్సెస్ వైఎస్‌ఆర్‌సీపీ - కేసినో రాజకీయంతో ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు !

Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Jan 2022 01:31 PM (IST) Tags: vijayasai reddy ysrcp latest news Raghurama krishna raju YSRCP Mps tweets war Vijayasai comments on Raghurama AP Politics latest

ఇవి కూడా చూడండి

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు