Nellore Mega Job Mela: నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా.. 20 టాప్ మోస్ట్ కంపెనీలు, వెయ్యికి పైగా పోస్టులు... ఎప్పుడంటే..!
నెల్లూరు జిల్లాలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా జరగనుంది. 20కి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులకు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశమన్న ఆయన.. ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 30న ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తున్నామని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకోసం ప్రతి ఏటా ఇలా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో వెయ్యి ఉద్యోగాలను జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తామని, సుమారు 20 కంపెనీలను ఈ జాబ్ మేళాకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
Also Read: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ అరాచకం.. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులు !
Also Read: యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్.. ఆలయంలో పనులు పరిశీలన
జిరాక్స్ కాపీలతో అటెండ్ కావొచ్చు
టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లొ ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ లాంటి కోర్సులు చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకపోయినా జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు అటెండ్ కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. అపెక్స్ సొల్యూషన్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపాచీ ఫుట్ వేర్, హీరో మోటార్స్, ఇసుజు, హెటిరో డ్రగ్స్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ ప్రతినిధుల ద్వారా ఔత్సాహిక యువతీ యువకులను ఎంపిక చేసుకుంటాయి. భారీ ప్యాకేజీలను అందించబోతున్నాయి. కొన్ని ఉద్యోగాలకు 5వ తరగతి మినిమమ్ క్వాలిఫికేషన్. ఈ జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 1085 ఉద్యోగాలు భర్తీ.. టెన్త్ పాస్ అయిన వాళ్లకు కూడా..
Also Read: రేపటి నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర... తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలనే లక్ష్యమని షర్మిల కామెంట్స్