By: ABP Desam | Updated at : 19 Oct 2021 03:54 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నారు. చేవెళ్ల టు చేవెళ్ల దాదాపుగా 4 వేల కిలోమీటర్లు 400 రోజుల పాటు చేయనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ భరోసా ఇస్తూ తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రను గుర్తు చేయాలనుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ తర్వాత పాదయాత్ర చేపడుతున్న వ్యక్తిగా షర్మిల ఆ ఘనత సాధించారు. ఇవాళ ఆమె కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.
రేపటి నుంచి చేవెళ్లలో ప్రారంభమయ్యే ‘ప్రజాప్రస్థానం’ మహాపాదయాత్రకు తండ్రి గారి ఆశీస్సులు ఉండాలని ఈ రోజు ఇడుపులపాయలోని మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద నివాళి అర్పించడం జరిగింది. తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే YSR తెలంగాణ పార్టీ ధ్యేయం. pic.twitter.com/c5GYWZComs
— YS Sharmila (@realyssharmila) October 19, 2021
Also Read: కేశినేని నిజంగా పార్టీ మారుతున్నారా? ఆయన సన్నిహితుడు ఏం చెప్పారంటే..
వైఎస్ఆర్ పాలన తీసుకురావడమే లక్ష్యం
వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే రైతులకి ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే పేద పిల్లలకు ఉచిత విద్య, పేద వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వడం అని గుర్తుచేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన ఉందా అంటే లేదు అనే సమాధానమే వస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు పెడుతున్నామన్నారు.
Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?
ప్రజల పక్షాన పోరాటం
తెలంగాణ మొత్తం తిరిగి ప్రతి పల్లెకు వెళ్తానని, ప్రతి గడపను తడతానని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటామన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పాదయాత్రను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా అన్నారు. అందరూ కలిసి పోరాడితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ సాధ్యమవుతుందన్నారు.
Also Read: కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... విద్యుత్ కొరత రాకుండా అత్యవసర ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్గా కిరణ్కుమార్ రెడ్డి ! కాంగ్రెస్కు జరిగే మేలెంత ?
Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
KKR vs LSG: క్రికెట్ కాదు LSGతో బాక్సింగ్ చేసిన రింకూ! నీలో చాలా ఉంది బాసు!
F3 Movie: 'ఎఫ్3' బడ్జెట్ - రెమ్యునరేషన్సే ఎక్కువ?
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి