అన్వేషించండి

Nara Lokesh: కాళేశ్వరం కట్టినప్పుడు అనుమతులు ఉన్నాయా - దిగువరాష్ట్రం నీళ్లు మళ్లించుకుంటే తప్పేంటి ? - నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Andhra Banakacharla Issue: బనకచర్లపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.

Nara Lokesh made key comments on Banakacharla:  బనకచర్ల అంశంపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారి.. దాన్నో రాజకీయ అంశంగా చేసుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం.. సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్ఱశ్నించారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందని ప్రశ్నించారు. 

బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్లడం ద్వారా నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ సముద్రంలో వృథాగా పోయే 200 టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఉద్దేశించినదని, ఇది కృష్ణా నది నీటిపై ఆధారపడదని పేర్కొన్నారు.   తెలంగాణ ప్రభుత్వం ,  బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తున్నారని, అయితే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరితమని లోకేష్ విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు త్వరలో శంకుస్థాపన జరుగుతుందని, దీనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ పేర్కొన్నారు.

వైసీపీ నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ధ్వంసం చేశారని, అమరావతి అభివృద్ధికి సింగపూర్‌తో ఒప్పందాలను రద్దు చేసి రాష్ట్రానికి నష్టం కలిగించారని ఆరోపించారు.   జగన్ పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీతో ఒప్పందాలు చేయవద్దని మెయిల్స్ పంపించారని ఆరోపించారు.  పెట్టుబడులు, ఉద్యోగాల కోసం 99 పైసలకు భూమి ఇవ్వడంలో తప్పు లేదని, ఈ ఆలోచన ప్రధానమంత్రి నుంచే వచ్చిందని వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
 
 కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఈ బ్రాండ్ కీలకమని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అనేక  చర్యలు  తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు.  గతంలో వైఎస్ఆర్‌సీపీ  నాయకులు తన తల్లిని అవమానించారని, మహిళల గౌరవం విషయంలో వైసీపీ  ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.                       

లిక్కర్ స్కాంలో  పక్కా ఆధారాలు ఉన్నాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓ డి స్టిలరీ కంపెనీ నాలుగు వందల కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసి లంచాలుగా ఇచ్చిందన్నారు. వారేమీ బంగారంతో లిక్కర్ తయారు చేయరు కదా అని ప్రశ్నించారు. ఆ బంగారం ఎక్కడ ఉందో బయటకు రావాల్సి ఉందన్నారు.  లిక్కర్ స్కామ్ లో నగదు.. పెద్దిరెడ్డి కంపెనీలకు వెళ్లిందన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ ఖాతాల్లోకి లిక్కర్ స్కామ్ సొమ్ము జ మకాలేదని చెప్పాలని సవాల్ చేశారు. పాపాల పెద్దిరెడ్డికి అన్నీ తెలుసని. పక్కా సాక్ష్యాలతో దొరికిపోయారన్నారు.                    
 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ మీద రికార్డు స్కోరు
లార్డ్స్ వన్డేలో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ మీద రికార్డు స్కోరు
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget