Nara Lokesh: పిన్నెల్లికి జగన్ సపోర్ట్‌పై నారా లోకేశ్ కౌంటర్
Nara Lokesh News: జగన్ మోహన్ రెడ్డి రూ.25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో పిన్నెల్లిని పరామర్శించేందుకు వెళ్లారని.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh counters to YS Jagan: ఎన్నికల వేళ ఈవీఎంను పగలకొట్టిన కేసులో నిందితుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని జైలులో ములాఖత్ అయిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి.. కూటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఎక్స్‌లో విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని జగన్ మోహన్ రెడ్డి సమర్థించిన తీరుపై అధికార పక్షం నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. మాచర్లలో అరాచకాలపై అనేక ఆరోపణలు వస్తున్న వేళ ఇలా మాజీ ఎమ్మెల్యేలను జగన్ పరామర్శిస్తుండడంతో ప్రస్తుతం నారా లోకేశ్ కూడా దీనిపై స్పందించారు.
‘‘డాక్టర్. సుధాకర్ ను చంపింది ఎవరు? ప్రజా వేదికను కూల్చింది ఎవరు? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని చంపింది ఎవరు? ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేసింది ఎవరు? అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు? టీడీపీ కార్యకర్త చంద్రయ్యని చంపింది ఎవరు? రూ.25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు సమాధానం చెప్పాలి’’ అని మంత్రి నారా లోకేష్ జగన్‌ను ప్రశ్నిచారు.
డాక్టర్. సుధాకర్ ను చంపింది ఎవరు?
— Lokesh Nara (@naralokesh) July 4, 2024
ప్రజా వేదికను కూల్చింది ఎవరు?
బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్ ని చంపింది ఎవరు?
ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేసింది ఎవరు?
అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు?
టిడిపి కార్యకర్త చంద్రయ్య ని చంపింది ఎవరు?
రూ.25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో… https://t.co/H8DOFLAbr5
జనసేన పార్టీ కార్యదర్శి నాగబాబు కూడా దీనిపై స్పందించారు. ‘‘జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా? కోపమొచ్చి E.V.M లు పగలగొట్టారా?? ఒకవేళ నిజంగా అన్యాయం జరగుంటే అక్కడ పోలిస్ సిబ్బంది లేరా Election సిబ్బంది లేరా?R.O లేరా?? ఇవన్నీ ఆలోచించకుండా కోపమొచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్థిస్తారా మీరు?? ఏం మాట్లడుతున్నారండి బాబు?? మిడిమిడి జ్ఞానంతో మితీమీరీన ఎచ్చులకి పోయినందుకే పదకొండుకే పరిమితం చేశారు ప్రజలు. ఇకనైనా Matured గా మారకపోతే ఈసారి సింగల్ డిజిట్ నే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు’’ అని నాగబాబు ఎక్స్ ద్వారా స్పందించారు.
జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా?
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 4, 2024
కోపమొచ్చి E.V.M లు పగలగొట్టార??
ఒకవేళ నిజంగా అన్యాయం జరగుంటే అక్కడ పోలిస్ సిబ్బంది లేరా Election సిబ్బంది లేరా?R.O లేరా??
ఇవన్నీ ఆలోచించకుండా కోపమొచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్దిస్తార మీరు??
ఏం మాట్లడుతున్నారండి…