అన్వేషించండి

Lokesh Yuvagalam Meeting: యువగళం ముగింపు సభకు కళ్ళు చెదిరే ఏర్పాట్లు, భారీ ఎత్తున తరలివస్తున్న టీడీపీ శ్రేణులు

2024 ఎన్నికలే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర  పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం- నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు కళ్ళు చెదిరే స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

ఇదే వేదిక నుంచి 2024 ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్ 
విజయనగరం: 2024 ఎన్నికలే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర  పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం- నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు కళ్ళు చెదిరే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరు కానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర చరిత్రలో గుర్తుండి పోయే విధంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనీ తెలుగు దేశం నాయకులు చెబుతున్నారు.ఈ యువగళం-నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. 

భారీ ఎత్తున వస్తున్న టీడీపీ నేతలు
రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ నేతలు... జనసైనకు లు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు.  ఈ వేదికపై నుండి ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు

సభా ప్రాంగణ ఏర్పాట్లు ఇవే
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం. పెద్దఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవనున్నారు. సభ ఎదురు వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్ధపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు, అభిమానుల  కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

సభాప్రాంగణం వద్ద పండుగ వాతావరణం
పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత థోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు,  జండాలతో ఆ ప్రాంతమంతా పసుపుజాతరను తలపిస్తోంది.

చిత్తూరు నుంచి యువగళం సభకు ప్రత్యేక రైళ్లు.. 
విజయనగరం జిల్లా పోలిపల్లిలో జాతీయ రహదారి వద్ద నిర్వహించే యువగళం ముగింపు సభకు చిత్తూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వెళ్లేందుకు జిజేఎం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక రైలును ట్రస్ట్ అధినేత టిడిపి నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు లాంఛనంగా మంగళవారం ఉదయం ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో సమస్యల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పోరాటం చేస్తున్నారన్నారు.. ఇందులో భాగంగా యువగళం ముగింపు విజయోత్సవ సభకు సుమారు పది లక్షల మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు.

చిత్తూరు పాకాల రేణిగుంట నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం విజయోత్సవ సభకు చేరుకోవడానికి ప్రత్యేక రైలును జిజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేమన్నారు.. ఈ యువగళం ముగింపు విజయోత్సవ సభకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారన్నారు.. యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఎన్నో సమస్యలను ప్రజల వివరించారని, వాటిని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని తెలిపారు..  రాబోయే 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పీటర్, జిల్లా నుండి భారీ ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget