Minister Kannababu : రాజమార్గంలో సాక్షి పెట్టుబడులు.. ఐటీ ట్రిబ్యూనల్ తేల్చిందన్న మంత్రి కన్నబాబు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు !
సాక్షిలో పెట్టుబడులను పెట్టుబడులుగానే ఐటీ శాఖ గుర్తించిందని మంత్రి కన్నబాబు ప్రకటించారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు గుండె పగిలిందని ఆయన విమర్శించారు.
సాక్షి పత్రికలోకి వచ్చిన రూ. 1200 కోట్లు పెట్టుబడులే అని సిటింగ్ జడ్జి, ఇతర జడ్జీలూ ఉండే ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. సాక్షి ఒక పత్రిక. అందులో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 1200 కోట్లు పెట్టుబడులు రాజమార్గంలో పెట్టారన్నారు. జగన్మోహన్ ెడ్డి లొంగలేదని దొంగ కేసులు పెట్టారని కన్నబాబు ఆరోపించారు. అప్పట్లో సాక్షిలోకి వచ్చిన పెట్టుబడుల్ని పెట్టుబడులుకా కాకుండా ఆదాయంగా పరిగణించేలా ఆర్డర్ ఇప్పించారన్నారు. ఆ ఆర్డర్ వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనని కన్నబాబు వ్యాఖ్యానించారు.
Also Read: మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్, వంగవీటి రాధాకు కూడా.. ఆస్పత్రిలో చికిత్స
పెట్టుబడిగా రాజమార్గంలో వచ్చిన డబ్బును ఐటీవారు ఆదాయంగా ఎలా ట్రీట్ చేస్తారని ఆ రోజే ప్రశ్నించామని.. ఈ రోజు ట్రైబ్యునల్ అదే తీర్పు చెప్పిందని కన్నబాబు తెలిపారు. జగన్ పెట్టిన పత్రికలో పెట్టుబడులు చట్టబద్ధం అని, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం...ఈ దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్ చెప్పిందనేసరికి బాబు గుండెలు పగులుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు రాజమార్గంలో వచ్చాయని.. చంద్రబాబు కంపెనీల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయన్నది మాత్రమే విచారణ జరగాల్సిన అంశమని కన్నబాబు స్పష్టం చేశారు.
Also Read: తిరుపతి ఎయిర్‌పోర్టు అధికారులు-లీడర్స్ మధ్య రగడ.. ఆయన తీరే కారణమా! ప్రతీకారం కూడా..?
చంద్రబాబు హెరిటేజ్ ఎలా పుట్టింది? ఎలా పెరిగింది? చంద్రబాబు ఆస్తులు ఆయన ఎమ్మెల్యే అయ్యేనాటికి ఎంత? ఇప్పుడు ఎంత? చంద్రబాబు ఏమన్నా చింతపల్లి జమిందార్ కొడుకా? అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే హెరిటేజ్ షేర్ పెరుగుతుంది... చంద్రబాబుకు అధికారం పోతే హెరిటేజ్ షేర్ తగ్గుతుందని.. చంద్రబాబు అధికారానికీ, హెరిటేజ్ షేర్‌కి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. 2004లో చంద్రబాబు అధికారం నుంచి దిగే నాటికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్ విలువ రూ. 13 నుంచి రూ. 15 మాత్రమే. 2009లో మళ్ళీ ఓడిన నాటికి కూడా ఆ విలువ దాదాపుగా అంతే ఉంది 2014లో మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి దాని విలువ రూ. 100కు అటూ ఇటుగా ఉంది. ఇప్పుడు ఎంత ఉందో ఇంటర్నెట్‌లో చూడాలన్నారు.
Also Read: Minister Perni Nani: మీకు సినిమా తప్ప వేరే యావ లేదా.. మంత్రి పేర్ని నాని అసహనం
చంద్రబాబుకు వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాలే తప్ప ప్రజా జీవితంలో నిజాయతీ అన్నది లేదని విమర్శించారు. ఆస్తులమీద సీబీఐ విచారణ ఎదుర్కోకుండా నానా తంటాలూ పడి బయటపడ్డారని విమర్శించారు. ఏలేరు స్కామ్ నుంచి అమరావతి బినామీ కింగ్‌డమ్ వరకు ఏ ఒక్క స్కామ్ మీదా విచారణ జరగకుండా అన్ని రకాలుగా తన పలుకుబడిని ఉపయోగించగలిగారన్నారు.
పేదలకు, ప్రాజెక్టులకు తక్కువ ధరకే భారతీ సిమెంటు ఇస్తే.. హెరిటేజ్ లో బాబు ఏనాడైనా రిబేట్ ఇచ్చాడా..? అని కన్నబాబు ప్రశ్నించారు. భారతీ సిమెంట్ కంపెనీ నుంచి 28 ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన సిమెంట్ అవసరాలకు భారతీ సిమెంట్, మిగతా సంస్థలు సిమెంట్‌ను ఒక్కో బ్యాగ్ రూ. 230కే ఇస్తున్నారన్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 28 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను రిబేటుమీద సిమెంట్ కంపెనీలు ప్రభుత్వ నిర్మాణాల కోసం ఇచ్చాయనన్నారు. హెరిటేజ్ మాత్రం ఎలాంటి రిబేట్ ఇవ్వలేదన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి