News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pavan On TDP Love : ప్రతి జనసైనికుడి ఆలోచన ప్రకారమే పొత్తు.. టీడీపీ వన్ సైడ్ లవ్ పై పవన్ కల్యాణ్ స్పందన !

తెలుగుదేశం పార్టీ జనసేన విషయంలో వన్ సైడ్ లవ్ అన్న వ్యాఖ్యలు చంద్రబాబు చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. జనసైనికుల ఆలోచనల మేరకు పొత్తులు పెట్టుకుంటామని ప్రకటించారు.

FOLLOW US: 
Share:

జనసేన పార్టీతో పొత్తు విషయంలో టీడీపీ వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తులపై ఒక్కడినే నిర్ణయం తీసుకోనని అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. పొత్తులపై ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు అలోచిస్తామని..ఈ అంశంపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతి జనసైనికుడితో మాట్లాడిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటోందని అందుకే పలు పార్టీలు  జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. పొత్తుల కంటే ముందు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

Also Read: ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇతర పార్టీలతో పొత్తుల ప్రసక్తే ఉండదని చెప్పాలి. కానీ పవన్ కల్యాణ్ అవకాశాలు ఓపెన్‌గానే ఉన్నాయని చెప్పారు. దీంతో  ఉపయోగకరమైన పొత్తుల విషయంలో సిద్ధంగా ఉన్నట్లుగా టీడీపీకి సంకేతాలు పంపినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Also Read: పవన్‌ను పదే పదే టార్గె‌ట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసిన జనసేన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కూటమిలో భాగం అయింది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఎన్నికల ఏడాదిలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఆ పొత్తుల వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే..  ఎలాంటి ఎలాంటి ఎన్నికలు లేకపోయినప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అందర్నీ ఆశ్చర్య పరిచారు.

Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...

అయితే బీజేపీతో పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం తిరుపతి ఉపఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ జనసేన క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు దూరమయ్యారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన చట్టసభల్లో ప్రభావవంతమైన స్థానాన్ని పొందకపోతే పార్టీ బలహీనం అయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఉభయతారక పొత్తుల కోసం పవన్ సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 08:30 PM (IST) Tags: pawan kalyan ANDHRA PRADESH tdp janasena AP Politics TDP-Janasena alliance Chandrababu-Pawan Kalyan

ఇవి కూడా చూడండి

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు