Pinnelli to Macherla Clash : మాచర్లలో దాడులు టీడీపీ కుట్రే, ప్రచారం కోసమే పార్టీ ఆఫీస్ కు నిప్పు- ఎమ్మెల్యే పిన్నెల్లి
Pinnelli to Macherla Clash : వైసీపీ ప్రభుత్వ సంక్షేమం చూసి ఓర్వలేక టీడీపీ దాడులకు పాల్పడుతుందని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. మాచర్లలో దాడులు టీడీపీ కుట్ర అన్నారు.
![Pinnelli to Macherla Clash : మాచర్లలో దాడులు టీడీపీ కుట్రే, ప్రచారం కోసమే పార్టీ ఆఫీస్ కు నిప్పు- ఎమ్మెల్యే పిన్నెల్లి Macherla Ysrcp Mla Pinnelli ramakrishna reddy says TDP leaders planned clashes DNN Pinnelli to Macherla Clash : మాచర్లలో దాడులు టీడీపీ కుట్రే, ప్రచారం కోసమే పార్టీ ఆఫీస్ కు నిప్పు- ఎమ్మెల్యే పిన్నెల్లి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/4cf40cbc2fd74f390e5478fd717f86091671276058865235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pinnelli to Macherla Clash : మాచర్లలో అల్లర్లు, దాడులు టీడీపీ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో పథకం ప్రకారం వైఎస్సార్ పీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రచార కార్యక్రమంలో ఎవరైనా రాడ్లు, కర్రలు, మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. పార్టీ జెండాల స్థానంలో రాడ్లు పట్టుకుని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్మహ్మారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు మాచర్లలో భయానక వాతావరణం సృష్టించారన్నారు. డిసెంబరు 16 సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పల్నాడులో చెలరేగిన హింసాత్మక ఘర్షణలను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలు ఓర్చుకోలేక ప్లాఫ్ షోలు చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారని, అందుకే ప్రచారం కోసం మాచర్లలో దాడులకు తెగబడిందన్నారు. టీడీపీ ఫ్యాక్షన్, బెదిరింపు రాజకీయాలపై ఎమ్మెల్యే పిన్నెల్లి మండిపడ్డారు. శుక్రవారం జరిగిన ఘటన పల్నాడులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల మధ్య సామరస్యాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కొలేక టీడీపీ నాయకులు ప్రజలను దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
అధికార దాహంతో రెచ్చిపోతున్న పచ్చ గూండాలు..
— Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) December 16, 2022
కార్యకర్తలను రెచ్చ గొట్టి వీధుల్లోకి పంపుతున్న చంద్రబాబు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుతున్న చంద్రబాబు నాయుడు.
మృగాళ్ల లాగా వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, ప్రజలపై ఎలా విరుచుకు పడుతున్నారో చూడండి. pic.twitter.com/dgZtYQPcJK
దాడులకు టీడీపీదే బాధ్యత
పల్నాడులో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత టీడీపీ దౌర్జన్యంతో దాడులు చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. సొంత వాహనాలకు నిప్పు పెట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని పిన్నెల్లి అన్నారు. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్ కావాలనే మాచర్లకు ఫ్యాక్షన్ నేతలను పంపి గొడవలు చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో టీడీపీ ఫ్యాక్షన్ మూలాలతో దాడులు చేసి ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఈ సెంటిమెంట్లను దుర్వినియోగం చేస్తోందన్నారు. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారన్నారు. ఇలాంటి దాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడేది లేదన్నారు. టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్లు, ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడికి పాల్పడేలా టీడీపీ కార్యకర్తలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజా ఆస్తులు, వాహనాలు, ఇళ్లు ధ్వంసానికి టీడీపీదే బాధ్యత అని పిన్నెల్లి అన్నారు. ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డు అయ్యిందన్నారు. దాడుల వీడియో ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. ఆధారాలన్నీ పోలీసులకు అందిస్తామన్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)