అన్వేషించండి

YSRCP On Lokesh Yuvagalam: గంటకు 5 కోట్ల ఖర్చుతో బెజవాడలో లోకేష్ పాదయాత్ర: వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి

గంటకు ఐదు కోట్లు ఖర్చు చేసి బెజవాడ లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు: మల్లాది విష్ణు, వైసీపీ ఎమ్మెల్యే

బెజవాడలో గంటకు ఐదు కోట్లు ఖర్చు చేసి లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తాడేపల్లి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... విజయవాడలో దొంగ టీడీపీ బాండ్ల ను దొంగ చాటు గా అమ్మారన్నారు. గోశాలని అక్రమంగా కూల్చి దారుణానికి ఒడికట్టారని ఆరోపించారు. కేబినెట్ లో ముస్లిం లకు ఎందుకు చోటు ఇవ్వ లేదు అని ప్రశ్నించారు. రాజధానిలో విజయవాడ, గుంటూరులో పేదలకు సీఎం జగన్ ఇళ్ళు ఇస్తుంటే లోకేష్ ఎందుకు అడ్డుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆరోపించారు. టీడీపీ హయంలో జగన్ పాదయాత్ర చేస్తుంటే ప్రకాశం బ్యారేజ్ మీదగా వెళ్ళాలి అని అడిగితే, కుదరదు అని కనకదుర్గమ్మ వారధి మీదగా వెళ్ళాలి అని చెప్పారని వెల్లడించారు.

అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిలో మూడు పంటలు పండే భూముల రైతుల నుంచి లాక్కున్నారని చెప్పారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలీదా అని ప్రశ్నించారు. ఇవన్నీ మరిచి ప్రస్తుతం ఋషికొండ మీద మాట్లాడడం సరికాదన్నారు. లోకేష్, చంద్రబాబు, గత క్యాబినెట్ లో ఉన్నవారు. ఇప్పుడు వీరికి మద్దతు ఇస్తున్న వారు సైకోలు అని పరోక్షంగా చురకలు అంటించారు.  వీటికి లోకేష్ సమాధానం చెప్పలని డిమాండ్ చేశారు.  లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవలని హెచ్చరించారు. విజయవాడ వైసీపీ అడ్డా ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు అని హెచ్చరించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... లోకేష్ పాదయాత్ర కి స్పందన రాకపోవడంతో దత్తపుత్రుడు పవన్ ను చంద్రబాబు రంగంలోకి దింపారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ప్రభుత్వం పైన బురద పోసేందు నానా తిప్పలు పడుతున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు కి ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

పుష్కరాలు పేరుతో 40 ఆలయం లను కూల్చారన్నారు. ముగ్గురు హిందూ ద్రోహులు... కానీ జగన్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న, వర్ల రామయ్య కి కూడా వైసీపీ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పథకాలు ఇచ్చామన్నారు. లోకేష్ రాష్ట్ర అంతం యాత్ర చేస్తున్నారని ద్వజమెత్తారు. దమ్ముంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేయగలరా అని సవాలు విసిరారు. లోకేష్ ది పాదయాత్ర కాదు ఈవెనింగ్ వాక్ అని జనాన్ని జోకర్ లుగా భావిస్తున్నారని తెలిపారు.  తమ సొంత పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ కూడా లోకేష్ పాదయాత్ర ని బాయ్ కట్ చేశారని ఆరోపించారు.

బాహుబలి రేంజ్ లో లోకేష్ పాదయాత్ర కి బిల్డప్ ఇచ్చారని దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో లోకేష్ చేస్తున్న పాదయాత్రపై ఆయన చురకలు అంటించారు. అవినాష్ మాట్లాడుతూ.... పాదయాత్ర చివరకు సంపూర్ణేష్ బాబు సినిమా లాగా తయారు అయ్యిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన దమ్మున్న నాయకుడు జగన్ అని స్పష్టం చేశారు.

టీడీపీ తన పాలనలో ఏమి చేసిందో చెప్పలేని పరిస్థితి లో ఉందన్నారు. బీపీ పేషంట్ ఒక సైకో లాగా లోకేష్ ఊగిపోతున్నారని ద్వజమెత్తారు.
లోకేష్ పాదయాత్ర వలన టీడీపీ అధికారంలోకి రాదని, కనీసం ఎమ్మెల్యే కూడా గెలవాడని చెప్పారు. లోకేష్ యాత్రలో పోలీసులు, వ్యక్తి గత సిబ్బందికి కనీసం భోజనాలు కూడా పెట్టటం లేదని ఆరోపించారు. పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా లోకేష్ అడ్డుకున్నారని ప్రజలకు లోకేష్ క్షమాపణ చెప్పాలని అవినాష్ చెప్పారు. లోకేష్ ని జాకీలు వేసి లేపాల్సి వస్తుందిని చురకలు అంటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Harish Rao Arrest : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Harish Rao Arrest : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Uber: టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !
టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !
Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Yaganti Kshetram News Today: పందెం గెలిచాడు - ప్రాణం పోగొట్టుకున్నాడ-యాగంటి క్షేత్రంలో విషాదం
పందెం గెలిచాడు - ప్రాణం పోగొట్టుకున్నాడ-యాగంటి క్షేత్రంలో విషాదం
Embed widget