అన్వేషించండి

YSRCP Review Time : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !

స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి ఏకపక్ష విజయాలు సాధించింది. కానీ కొన్ని చోట్ల అనూహ్యమైన పరాజయాలు ఎదురయ్యాయి. వీటిపై సమీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తవుతోంది. అదే సమయంలో పంచాయతీ, పరిషత్, మున్సిపల్ పోలింగ్ రూపంలో ప్రజాభిప్రాయం కూడా చూచాయగా తెలిసింది. స్థానిక పరిస్థితులే.. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని నిర్దేశిస్తాయి. అదే సమయంలో జనం నాడిని కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది. మూడు దశల్లో జరిగిన స్థానిక సంస్థల ఫలితాలను విశ్లేషిస్తే వైఎస్ఆర్‌సీపీకి తిరుగులేదని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజా వ్యతిరేకత లేదా అంటే చెప్పలేని పరిస్థితి. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు అనూహ్యమైన విజయాలు సాధించడమే దీనికి కారణం.
YSRCP Review Time : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !

Also Read : మహిళా సాధికారతలో సువర్ణ అధ్యాయం.. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ది రావాలన్న సీఎం జగన్ !

ఘన విజయాల మధ్య కొన్ని ఓటములు !

మొదటి దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని విజయాల్ని సాధించింది. మున్సిపాలిటీల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. 70పై చిలుకు మున్సిపాల్టీల్లో ఎన్నికలో జరిగితే ఒక్కటి తప్ప అన్నీ వైఎస్ఆర్‌సీపీకే. కార్పొరేషన్లన్నీ ఆ పార్టీకే. పరిషత్ ఎన్నికల్లోనూ అదే హవా. కానీ ఆరు నెలలు తిరిగే సరికి జరిగిన మినీ లోకల్ వార్‌లో ప్రతిపక్షం పుంజుకున్నట్లుగా కనిపించింది. జరిగింది 12 నగర పంచాయతీ ఎన్నికలే అయినా రెండు చోట్ల టీడీపీ గెలిచింది. మరో మూడు, నాలుగు చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీకి పలు చోట్ల వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, గుంటూరుల్లో జడ్పీటీసీలను కోల్పోయింది. అందుకే... అంతా సంబరాలే కాదు.. సమీక్ష కూడా చేసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
YSRCP Review Time : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !

Also Read : దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !

ప్రకాశం నుంచి సిక్కోలు వరకూ సమీక్ష చేసుకోవాల్సిన సమయం !

రాయలసీమ ప్రాంతంలో ఎదురు లేకపోయినా ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్‌సీపీకి కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దర్శి గెలుపుతో పాటు పల్నాడులో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడానికి భయపడే పరిస్థితి ఉన్నా దాచేపల్లిలో గట్టి పోటీ ఇచ్చారు. గుంటూరులో సిట్టింగ్ కార్పొరేటర్ సీటును టీడీపీ గెల్చుకుంది. కృష్ణా జిల్లాలో కొండపల్లి టీడీపీ ఖాతాలో పడింది. జగ్గయ్యపేటలో టఫ్ ఫైట్ నడిచింది. పెడన జడ్పీటీసీ టీడీపీ గెల్చుకుంది. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ వైఎస్ఆర్‌సీపీ మెజార్టీ గెల్చుకున్నప్పటికీ కీలకమైన స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఈ పరిస్థితి ఖచ్చితంగా అలర్ట్ కావాల్సిన సమయాన్ని సూచిస్తుందని అనుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీకి అసలు చాన్సివ్వ కూడదని ... అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరవాతక కూడా ఈ ఫలితాలు వచ్చాయంటే చిన్న విషయం కాదు.
YSRCP Review Time : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !

Also Read : బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !

సంక్షేమ చాంపియన్ అయినా ఎందుకిలా ?

సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితాల కంటే వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పుడు కీలకమైన అంశంగా వైఎస్ఆర్‌సీపీ తీసుకుని సమీక్ష చేసుకోవాలన్న సూచనలు ఆ పార్టీ శ్రేయోభిలాషుల దగ్గర్నుంచి వస్తున్నాయి. నవరత్నాలు, సంక్షేమ పథకాలు, జనరంజకమైన పాలన ఇన్ని ప్లస్ పాయింట్ల మధ్య .. ఎందుకు వ్యతిరేక ఓట్లు పెరుగుతున్నాయన్నది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
YSRCP Review Time : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !

Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?

కరెక్ట్ చేసుకోవడానికి కావాల్సినంత సమయం !

అధికారంలో ఉన్న ప్రతీ పార్టీకి అధికార వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. సాధారణంగా అది చివరి ఏడాది వస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వానికి అది మూడో ఏడాదే కనిపిస్తోందనేది ఎక్కువ మంది చెబుతున్న మాట. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అంటే లోపాలు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి కావాల్సినంత సమయం ఉంది. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ మూకుమ్మడి సోదాలు.. మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget