AP Assembly Jagan : మహిళా సాధికారతలో సువర్ణ అధ్యాయం.. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ది రావాలన్న సీఎం జగన్ !
మహిళా సాధికారితపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడారు. రెండున్నరేళ్లుగా సువర్ణ అధ్యాయం నడుస్తోందన్నారు. మహిళలకు తమకే పట్టం కడుతున్నారని ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు.
రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మహిళా సాధికారితకు సువర్ణాధ్యాయం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మహిళల అభివృద్ధి కోసం తాము నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం రూ.1500 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. 31 లక్షల మందికి ఇంటిపట్టాలిచ్చామని..ఈ పథకాన్ని ప్రతిపక్ష పార్టీ కోర్టుకెళ్లి అడ్డుకుందన్నారు. అందుకే కుప్పంలో దేవుడి చంద్రబాబుకు మొట్టికాయలు వేశారన్నారు. కోటి మంది మహిళలకు సున్నా వడ్డీ ద్వారా లబ్ది చేకూర్చామన్నారు. పాడి పరిశ్రమ ద్వారా 3 లక్షల 40 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించామన్నారు. అమ్మఒడి పథకం తీసుకొచ్చి ... చదువులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు.
రాజకీయాలకు అతీతంగాఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. మహిళలకు ఆక్సీజన్‌గా ఆసరా పథకం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చాం' అని సీఎం జగన్ తెలిపారు. కేబినెట్‌లో మహిళలకు పెద్ద పీట వేశామని.. ఎస్‌ఈసీగా మహిళను నియమించామన్నారు. చరిత్రలో తొలిసారి ఈ నియామకం జరిగిందన్నారు. వాలంటీర్లలో 53శాతం మహిళలేనన్నారు. అలాగే ఏడుగురికి జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. దిశ చట్టం ఆమోదం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని జగన్ అసెంబ్లీలో తెలిపారు. మద్యం బెల్ట్ షాపుు, పర్మిట్ రూములను తీసేశామన్నారు.
Also Read : బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !
రాత్రి ఎనిమిది గంటలకే మద్యం దుకాణాలు మూసేస్తున్నామన్నారు. నేరాల విషయంలో గత ప్రభుత్వం కన్నా వేగంగా దర్యాప్తు చేసి చార్జిషీట్లు దాఖలు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో దేశ సగటుతో పోలిస్తే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మహిళా సాధికారితకు ప్రయత్నించాం కాబట్టే మహిళలు తమకు కుప్పం లాంటి చోట్ల పట్టం కట్టారని చెప్పారు. ఎన్నికల ఫలితాలను సీఎం జగన్ వివరించారు. ఆ లిస్ట్‌ను అసెంబ్లీలో ప్రదర్శించారు. 97 శాతం సీట్లు తమకు వచ్చాయన్నారు. చంద్రబాబుకు కనీసం ఇప్పటికైనా బుద్ది వస్తుందేమోనని జగన్ వ్యాఖ్యానించారు.
Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?
ప్రసంగం ప్రారంభంలో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు వస్తారేమోనని బీఏసీ సమావేశాన్ని కూడా కాస్త ఆలస్యం చేశామన్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బందేమిటో తనకు తెలియదని.. కుప్పం ఎఫెక్ట్ పడిందని తమ వాళ్లు చెప్పారని జగన్ వ్యాఖ్యానించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి