By: ABP Desam | Updated at : 18 Nov 2021 03:12 PM (IST)
సీబీఐకి అరెస్టయిన నిందితుడి లేఖలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. డ్రైవర్ దస్తగిరి ఇచ్చినే నేర అంగీకార వాంగ్మూలంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది. దీంతో మూడు రోజుల కిందటే అనారోగ్యం పేరుతో హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ కింద కడపకు తరలించారు. పులివెందుల కోర్టులో హాజరు పరిచారు.
Also Read : బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !
తనకే పాపం తెలియదని దేవిరెడ్డి శంకర్ రెడ్డి సీబీఐ డైరక్టర్‌కు లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని.. తాను నిర్దోషినని లేఖలో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికిస్తున్నారని ... వివేకా మరణం గురించి తనకు ఉదయం తెలిసిందన్నారు. హైదరాబాద్‌లో వివేకానందరెడ్డి బావమరిది ద్వారా తనకు విషయం తెలిసిందన్నారు. అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పలుమార్లు ప్రశ్నించిందని ్లాగే.. 2019 మార్చి నెలలో వారం రోజులపాటు ప్రశ్నించారని విచాణ సమయంలో నన్ను తీవ్రంగా హింసించారని కూడా లేఖలో శంకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత కూడా మరో మూడు సార్లు తనను ప్రశ్నించారన్నారు.
Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?
లేఖలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి వైఎస్ వివేకా కుమార్తె సునీతపైనే ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని అన్నారు. ఆమె ఇష్టాయిష్టాల ప్రకారం.. అమాయకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ, నిందలు మోపారని.. ఓ వర్గం మీడియా పథకం ప్రకారం ప్రచారం చేసిందని ఆరోపించారు. కారణాలేంటో తెలియదుగాని సునీత వ్యవహారం భిన్నంగా ఉందని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి పలు అనుమానాలను సీబీఐకి రాసిన లేఖలో వ్యక్తం చేశారు.
ఎర్రగంగిరెడ్డి ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు? ఎవరు చెప్తే ఆయన అక్కడకు వచ్చారు? ఆయనతో టచ్‌లో ఉన్న వివేకా కుటుంబ సభ్యులు ఎవరు? ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని, వీడియో తీయాలని ఆదేశాలు ఇచ్చిన ఎవరు? పీఏ మూలి వెంకట కృష్ణా రెడ్డి మొబైల్‌ఫోన్, వివేకా రాసినట్టుగా చెప్తున్న లేఖను ఎందుకు దాచిపెట్టారు? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దస్తగిరికి కేవలం ఐదురోజుల్లో ముందస్తు బెయిల్ మంజూరు అయ్యిందని.. సునీత భర్తే లాయర్‌ను పెట్టి ఆయనకు బెయిల్ ఇప్పించాడని పేర్కొన్నారు. ఈ లేఖలో ఇతర రాజకీయ ఆరోపణలు కూడా దేవిరెడ్డి శంకర్ రెడ్డి చేశారు. వివేకా హత్యకు కొన్ని వారాల ముందు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి సహా తదితరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారని తర్వాత వారు విజయవాడలో ఒక హోటల్‌లో ఉన్నారు అక్కడే కుట్రలు చేశారని ఆరోపించారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ మూకుమ్మడి సోదాలు.. మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ !
మరో వైపు శంకర్ రెడ్డి కొడుకు కూడా తన తండ్రికి ఏ పాపం తెలియదని సీబీఐకి ఓ లేఖ రాశారు. వివేకా హత్య కేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆరోపణలతోనే అరెస్టు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 15న ఆయన ఎడమ భుజానికి సర్జరీ జరిగిందని... ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యంతో ఉన్నందున న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేస్తున్నానని అందులో చైతన్య రెడ్డి పేర్కొన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Hyderabad Crime : ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన యువకుడు, రెండేళ్లు సహజీవనం చేసి పరార్!
Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?
Bank Fraud: డేటింగ్ యాప్‌లో అమ్మాయితో లవ్వు! పనిచేస్తున్న బ్యాంకుకే కన్నమేసిన ఉద్యోగి!
Chandigarh news:ఆ ఐఏఎస్ అధికారి కొడుకుని టార్చర్ చేసి చంపారా, కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు
East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
Chiranjeevi: 'పక్కా కమర్షియల్' స్టేజ్ పై మారుతితో మెగాస్టార్ బేరం!
Presidential Election 2022 : రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, హాజరుకానున్న మంత్రి కేటీఆర్
Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, రేపు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
Dell G15 5525: వావ్ అనిపించే గేమింగ్ ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన డెల్ - ధర ఎంతంటే?