NIA Attacks : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ మూకుమ్మడి సోదాలు.. మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ !
రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు , విశాఖపట్నం అరిలోవ కాలనీలోని న్యాయవాద దంపతులు శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లు, హైదరాబాద్ నాగోల్‌లో రవిశర్మ, అనురాధ ఇళ్లు, అల్వాల్ సుభాష్ నగర్ లో నివాసముంటున్న అమరుల బంధు మిత్రుల సంఘం నేత పద్మ కుమారి ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరులోని అరవింద నగర్‌లో తనిఖీలు చేపట్టడంతో చుట్టుపక్కల వారు హడలిపోయారు. ఏడాది కాలంగా ఇక్కడ చైతన్య మహిళా సంఘం నేతలు కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి నివాసంలో తనిఖీలు చేపట్టారు. చైతన్య మహిళా సంఘంలో ఇద్దరు అక్కచెల్లెల్లున్నారు. వారి సోదరుడు రవి మావోయిస్టు సెంట్రల్ కమిటీ టెక్నికల్ టీమ్ లో పనిచేస్తూ ఇటీవల మృతి చెందారు. దీంతో ఎన్ఐఏ బృందాలు ఇక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. కనీస వివరాలు తెలుసుకోడానికి కూడా మీడియాను దగ్గరకు అనుమతించడంలేదు అధికారులు.
Also Read: Balka Suman: ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై దుష్ప్రచారం... నలుగురు వ్యక్తులు అరెస్టు.. పరారీలో ముగ్గురు యువకులు
ఉదయం ఐదు గంటలకే తెలుగు రాష్ట్రాలకు టార్గెట్ చేసుకున్న ఇళ్లకు ఎన్‌ఐఏ బృందాలు వెళ్లాయి. మొత్తంగా 14 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా అలకూరపాడులో ఇటీవల చనిపోయిన మావోయిస్టు నేత ఆర్కే భార్య నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్కే జీవిత చరిత్రను ప్రింటింగ్ చేయించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆ ప్రతులన్నింటినీ తీసుకెళ్లిపోయారు.
Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?
అలాగే ఇటీవలి కాలంలో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రత్యేకంగా మావోయిస్టు ఉద్యమాన్ని బలగాలు పూర్తి స్థాయిలో అణిచివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలో మావోయిస్టుల సానుభూతిపరులు, వారి బంధువులు వంటి వార ఇళ్లలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సోదాలపై ఎన్‌ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి