Srisailam Temple: శ్రీశైలంలో నేటి నుంచి 5 రోజులపాటు ఉగాది ఉత్సవాలు
Ugadi 2022 Celebrations: నేటి నుంచి ఏప్రిల్ 3 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాలలో ప్రతి రోజు ప్రత్యేక పూజాధికాలు, వాహన సేవలలో భక్తులకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనమివ్వనున్నారు.
Ugadi Celebration Begins At Srisailam Temple: శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలను శ్రీశైల దేవస్థానం నిర్వహించనుంది. ఇప్పటికే ఉగాది మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు. నేటి ఉదయం 9 గంటల 15 నిమిషాలకు స్వామివారికి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 3 తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాల (Ugadi 2022 Celebration)లో ప్రతి రోజు ప్రత్యేక పూజాధికాలు, వివిధ వాహన సేవలలో భక్తులకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
అమ్మవారికి, మల్లికార్జునుడికి చీర, సారెలు..
భ్రమరాంబికాదేవి తమ ఆడపడుచుగాను మల్లికార్జునస్వామి (Sri Bhramaramba Mallikarjuna Swamy Temple) తమ అల్లుడుగానూ తలుస్తూ చీర, సారె, డోలీలతో వందల కిలోమీటర్లు కాలినడకన శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి దర్శించుకుంటారు. బుధవారం నుంచి జరిగే ఉగాది 2022 మహోత్సవాలకు ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం చేశామని ఆలయ ఈవో లవన్న, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలకు సైతం భక్తుల తాకిడి అధికమైంది. మరోవైపు టికెట్ల కోటాను టీటీడీ పెంచడం మరో కారణం.
కన్నడ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..
శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్న కన్నడిగులకు దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు (Devotees From Karnataka to Srisailam Temple) చేశామని ముఖ్యంగా శివదీక్ష శిబిరాల వద్ద ఉద్యానవనాల్లో ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటుచేసి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా భక్తులకు విశేష సేవలను అందిస్తున్నారు. క్యూ కాంప్లెక్సుల వద్ద నిత్యము అల్పాహారాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. నిత్య కళావేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు విస్తృతంగా వాహనాలకు పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 300 మంది సిబ్బందితో పాటుగా మరికొంత మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కల్పించినట్లు దేవస్థానం ఈవో ఎస్.లవన్న (Srisailam Tempel EO Lavanna) తెలిపారు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో