News
News
X

Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023లో ఈ రాశివారికి అదృష్టం మామూలుగా లేదు, పనులు ఇలా అనుకుంటే అలా పూర్తైపోతాయ్

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

FOLLOW US: 

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో వృశ్చిక రాశి ఫలితాలు

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1

శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృశ్చికరాశివారికి ...ధనం, కుటుంబ కారకుడైన గురుడు 5వ స్థానంలో, శని మూడో స్థానంలో, రాహు కేతువులు6, 12 స్థానాల్లో ఉండటంతో ఈ సంవత్సరం మిగిలిన రాశులవారికన్నా ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. గురు, శని ప్రభావంతో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తైపోతాయి. ఇంకా వృశ్చికరాశివారికి ఈ ఏడాది ఎలా ఉందంటే...

 • ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. అప్పుల బాధకు దూరంగా ఉండాలి
 • గురువు పంచమ స్థానంలో, రాహువు ఆరో స్థానంలో ఉండడంతో ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది
 • స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు, వృద్ధి చేస్తారు, విశేష భూలాభం, గృహయోగం వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి
 • శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపార యోగం  ఉంటుంది
 • దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి
 • చాలాకాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి
 • విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది,చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు
 • విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి
 • పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
 • కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, శుభకార్యాలు నిర్వహిస్తారు
 • ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు, ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం వస్తుంది
 • ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉంటారు, మీరు లాభపడతారు,మీ చుట్టూ ఉండేవారికి సహాయం చేస్తారు
 • ఉద్యోగులకు బాగా కలిసొచ్చే సమయం ఇది, అధికారుల అనుగ్రహం మీపై ఓ రేంజ్ లో ఉంటుంది
 • వేసుకున్న ప్రణాళికలు అమలుచేయగలుగుతారు, అంచనాలను అందుకుంటారు, సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు
 • వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు
 • వ్యవసాయం, తోటల రంగాల వారికి దిగుబడి సంతృప్తినిస్తుంది.
 • ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది
 • అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి

ఒక్కమాటలో చెప్పాలంటే ఏవో చిన్న చిన్న అడ్డంకులు మినహా ఈ ఏడాది వృశ్చిక రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది...

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read:  2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు

Also Read:  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

Published at : 30 Mar 2022 08:14 AM (IST) Tags: subhakruth nama samvatsara 2022 sri shubhakruth nama samvatsara ugadi rasi phalalu sri shubhakruth nama samvatsara ugad panchangam 2022-2023 ugadi Horoscope 2022-2023 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces

సంబంధిత కథనాలు

మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్

మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

Dussehra2022: దసరా రోజు జమ్మిచెట్టుని ఎందుకు పూజిస్తారు,పాలపిట్టను ఎందుకు చూడాలంటారు!

Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!

Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!