News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

FOLLOW US: 
Share:

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో కన్యరాశి ఫలితాలు

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5

శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కన్యరాశి వారికి గురుడు సప్తమంలో, శని ఐదవ స్థానంలో, రాహువు అష్టమంలో ఉండటం వల్ల గడిచిన ఏడాది కన్నా ఈ ఏడాది శుభఫలితాలున్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, సంఘంలో గౌరవం-పలుకుబడి పెరుగుతాయి. ఇంకా ఈ రాశివారికి ఈ ఏడాది ఎలా ఉందంటే...

  • ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  చర,స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు, నూతన గృహనిర్మాణాలు కలిసొస్తాయి
  • సప్తమంలో గురుబలం విశేషమైన శుభాన్నిస్తుంది..గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతారు
  • ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు. ఉన్నతాధికారుల అనుగ్రహం మీపై ఉంటుంది
  • శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల అప్పుడప్పుడూ ఆటంకాలెదురవుతాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోవద్దు,మరీ ముక్కుసూటిగా వ్యవహరించవద్దు
  • వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలుంటాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పోటీపరీక్షలు రాసిన వారు విజయం సాధిస్తారు
  • మీరు తలపెట్టిన ప్రతిపనిలోనూ కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అలసత్వం లేకుండా లక్ష్యాలను పూర్తి చేయండి.
  • ఏ రంగంలో ఉన్నవారికి అయినా ఈ ఏడాది కలిసొస్తుంది
  • నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది
  • మీకున్న వాక్చాతుర్యంతో ఎంతటివారినైనా కట్టిపడేస్తారు,శత్రువులే మిత్రులుగా మారి సహాయం చేసే సందర్భాలుంటాయి
  • అష్టమంలో రాహువు ఉండటం వల్ల ప్రతి విషయంలో చంచలత్వం ఉంటుంది, మీకున్న సహజమైన తెలివితేటలతో పనులు పూర్తిచేసుకోగలుగుతారు
  • ధనం మీదైనా, ఇతరులదైనా కానీ మీ చేతినిండా డబ్బు పుష్కలంగా ఉంటుంది
  • మీ సక్సెస్ ని చూసి కొందరు ఓర్వలేరు
  • పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు
  • స్వల్పంగా శరీర రుగ్మతలు కలిగినా వాటినుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది
  • సంవత్సరం మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా అంతగా బాధించవు

ఒక్కమాటలో చెప్పాలంటే మీ శక్తి సామర్థ్యాలకు, ధైర్యానికి దైవబలం తోడవుతుందన్నమాట

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read:  ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

Published at : 29 Mar 2022 01:19 PM (IST) Tags: subhakruth nama samvatsara 2022 sri shubhakruth nama samvatsara ugadi rasi phalalu sri shubhakruth nama samvatsara ugad panchangam 2022-2023 ugadi Horoscope 2022-2023 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces

ఇవి కూడా చూడండి

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Spirituality: రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

Spirituality:  రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

Horoscope Today: ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

Horoscope Today:  ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?