News
News
X

Prison Restaurant: అక్కడ తినాలంటే జైలు ఊచలు లెక్కించాల్సిందే... ఆ కథ తెలియాలంటే ఇది చదవండి..

మీరు ఎప్పుడైనా జైలు ఊచలు కానీ, జైలు సెల్ కానీ చూశారా.. ఇక వాటినే చూడకపొతే అక్కడ ఏం భోజనం చేస్తారు లేండి. కానీ జైలుకెళ్లకుండా ఆ వాతావరణాన్ని చూడాలంటే అనంతపురంలోని ప్రిజన్ రెస్టారెంట్ కు వెళ్తే చాలు.

FOLLOW US: 

Prison Restaurant In Anantapur: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఉండటం ఎంత సహజమో.. వాటి ఆహారపు అలవాట్లు, శైలి సైతం అంతే భిన్నంగా ఉంటుంది. విభిన్న రుచులకు, విభిన్న వంటకాలకు పేరున్న అనంతపురంలో సరికొత్త పోకడలతో రెస్టారెంట్లను ఓపెన్ చేస్తున్నారు. ఇతర రెస్టారెంట్లతో పోల్చితే ఇది చాలా డిఫరెంట్ గురూ..

ఆ రెస్టారెంట్ల భోజనం చేయాలంటే జైలు ఊచలు లెక్కించాల్సేందే. అంటే మిమ్మల్ని జైలుకు పంపించడం మాత్రం కాదండోయ్. జైలు సెల్ చూడాల్సిందే.సెల్ లో లాకప్ కావాల్సిందే. ఇదేంది అనుకొంటున్నారా. అవునండీ చెప్పాం కదా... అనంతపురంలో ఏం చేసినా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ఇలా డిజైన్ చేశారు. ఆ వింతే జైలు థీమ్ రెస్టారెంట్ కథ..

అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ బైపాస్‌లో ఉన్న ప్రిజన్ రెస్టారెంట్ కు వెళ్తే అచ్చం జైలు వాతావరణమే కన్పిస్తోంది. ఈ జైలు రెస్టారెంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా జైలుకు సహజంగా ఉండే సెంట్రీ, ఇక్కడ కూడా అదే విదంగా సెంట్రీ ఉంటాడు. ఇక హోటల్లో ఎక్కడ చూసినా తుపాకులు, కారాగారంలో ఉండే వస్తువులు.. ఇలా ఒక్కటేమిటి అచ్చు జైలు వాతావరణమే కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. మనం వెల్లగానే ఖైదీ దుస్తుల్లో ఉన్న సర్వర్లు వచ్చి సెల్ తెరిచి కటకటాల్లోకి పంపి కస్టమర్లను లాకప్ చేస్తారు. దీంతో ఇది రెస్టారెంట్ కాదు... నిజమైన జైలు అన్న ఫీలింగ్ వస్తుందంటున్నారు భోజనప్రియులు.

కార్పొరేట్ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌గా మారిన సమయంలో ఖాళీ సమయంలో ఎందుకు ఊరుకోవాలని ఈ హోటల్ రంగంలోకి వచ్చారు అనూష, మనోజ్, రఘువంశీ. వీళ్లుఈ ప్రిజన్ థీమ్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఒకసారి వస్తే రెస్టారెంట్ గుర్తుండిపోయేలా ఈ హోటల్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు చెప్తున్నారు.ఈ రెస్టారంట్ ఏర్పాటుకు ముందు అనేక హొటళ్లను పరిశీలించిన అనంతరం అక్కడ కేవలం వంటలు, రొటీన్ వాతావరణం ఉందని గమనించినట్లు చెప్పారు. అందుకే కొంచెం డిపరెంట్ గా ఉండేలా ఈ ప్రిజన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశామంటున్నారు. అయితే ప్రారంభించి కొద్దిరోజులు కావడంతో ఇంకా ఈ హోటల్ గురించి చాలా మందికి తెలియలేదు.

అయితే ప్రిజన్ థీం (జైలు రెస్టారెంట్) లాంటి భిన్నమైన హోటల్ కదా రేట్లు ఎక్కువ అని అనుకుంటన్నారా... అదేమీ లేదండీ మామూలు రేట్లేనని చెప్తున్నారు. ఇక్కడ నలభై రకాల టిఫిన్లు ఏర్పాటు చేశామని, మధ్యాహ్నం మెనులో కూడా రాయలసీమ రెసిపీలతో పాటు అన్నిరకాల వంటలను కూడా యాడ్ చేశారు.  
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

సో చూశారుగా ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా వినూత్నంగా ఆలోచిస్తే తప్ప ఈ పోటీ ప్రపంచంలో నిలబడటం కష్టమన్న భావనతోనే ఈ ప్రిజన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. సో మీరు అదే ప్రాంతంలో ఉంటే ఒకసారి ప్రిజన్ రెస్టారెంట్‌ను సందర్శించి వినూత్న అనుభూతిని పొందండి.

Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !

Also Read: Election 2022 EC Guidelines : ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కరోనా ఆంక్షలు ! సెమీఫైనల్స్‌లో "ఎలక్షన్ ఫ్లేవర్" మిస్ అయినట్లే !?

Also Read: Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Jan 2022 07:35 AM (IST) Tags: food ANDHRA PRADESH AP News Anantapur HOTELS Prison Restaurant In Anantapur Prison Restaurant Jail Restaurant In Anantapur Jail Restaurant

సంబంధిత కథనాలు

పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు

పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు

Employee Selfi Video: ‘బాబోయ్, రెడ్డి రాజ్యంలో పని చెయ్యలేం’ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, సెల్ఫీ వీడియో

Employee Selfi Video: ‘బాబోయ్, రెడ్డి రాజ్యంలో పని చెయ్యలేం’ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, సెల్ఫీ వీడియో

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

కౌబాయ్‌ గెటప్‌లో కర్నూలు ట్రాఫిక్ పోలీస్-కొత్త లుక్‌లో విధులు

కౌబాయ్‌ గెటప్‌లో కర్నూలు ట్రాఫిక్ పోలీస్-కొత్త లుక్‌లో విధులు

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !

TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం  - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు  !

టాప్ స్టోరీస్

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!