Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి అధ్వానమే..!
మహారాష్ట్రలో కొత్తగా 41,434 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ముంబయిలోనే 20,318 కరోనా కేసులు వచ్చాయి.
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా.. 20,181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో, పాజిటివిటీ రేటు 19.60 శాతానికి పెరిగింది. ఢిల్లీలో గత 24 గంటల్లో ఏడు మరణాలు నమోదయ్యాయి. 1586 మంది రోగులు కొవిడ్ ఆసుపత్రులలో చేరారు. అడ్మిట్ అయిన వారిలో 1308 మంది ఢిల్లీకి చెందిన వారు కాగా, 172 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. గడిచిన 24 గంటల్లో 1,02,965 మందికి కరోనా పరీక్షలు చేశారు.
మహారాష్ట్రలో కొత్తగా 41,434 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ముంబయిలో 20,318కి వైరస్ సోకింది. ముంబయిలో 24 గంటల వ్యవధిలో ఐదు కొవిడ్ మరణాలు సంభవించాయి. ప్రస్తుతానికి, 1,257 మంది రోగులు ఆసుపత్రిలో ఉన్నారు. 108 మంది ఆక్సిజన్ సిలీండర్ మీద చికిత్స పొందుతున్నారు. ముంబయిలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,037గా ఉన్నాయి.
బంగాల్లో కొత్తగా 18,802 కేసులు నమోదు అవ్వగా.. 8,112 మంది రికవరీ అయ్యారు. 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62,055గా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 29.6 శాతంగా నమోదైంది. కర్ణాటకలో మొత్తం 8,906 కొత్త వైరస్ కేసులు నమోదవ్వగా.. 508 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 38,366కు చేరింది. 38 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గుజరాత్‌లోనూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ నగరంలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వివిధ పట్టణాల్లో పెరుగుతున్న కేసులతో వలస కార్మికుల్లో ఆందోళన మెుదలైంది. చాలా మంది సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !
Also Read: Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు... మరో చోటుకు మకాం మార్చుతుంటే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Also Read: Vanama Raghava Case: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
Also Read: కామారెడ్డి జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ కేసులు
Also Read: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి