Kurnool Diamond: వ్యవసాయ పనులకు వెళ్తే వజ్రం దొరికింది - కర్నూలులో వ్యవసాయ కూలీ రాత మార్చిన డైమండ్
15 Carat Diamond: తొలకరి వర్షాలు ప్రారంభమైన తర్వాత కర్నూలులో వజ్రాలవేట ప్రారంభమవుతుంది. కొంత మంది అదృష్టవంతులకు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఇలా అదృష్టం ఓ మహిళా వ్యవసాయ కూలీని వరించింది.

Daimond News: కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలోని పెండెగల్లు గ్రామంలో ఒక మహిళా వ్యవసాయ కూలీకి 15 క్యారెట్ల వజ్రం దొరికినట్లుత ెలుస్తోంది. కర్నూలు జిల్లాలో, ముఖ్యంగా తుగ్గలి మరియు వజ్రకరూర్ ప్రాంతాల్లో, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వజ్రాల కోసం పొలాల్లో వెతకడం సాధారణం. ఈ ప్రాంతం వజ్రాల నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది, అదృష్టం కలిసొస్తే జీవితం మారిపోతుందనే ఆశతో స్థానికులు ఈ వేటలో పాల్గొంటారు.
ఈ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి పది లక్షలు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ దాని విలువ యాభై లక్షలు ఉంటుందన్న కారణంగా ఆ వ్యవసాయకూలీ కుటుంబం అమ్మకం జరపలేదు.
💎 A 15-carat diamond was found by a woman farm labourer in Pendegallu village, Tuggali mandal, Kurnool district.
— Andhra Nexus (@AndhraNexus) July 4, 2025
It hasn't been sold yet as no deal was finalised.
Every year during monsoon, people search for diamonds in fields across Kurnool & Vajrakarur hoping to get lucky. pic.twitter.com/yhYVLsxVNL
15 క్యారెట్ల వజ్రం చాలా ఖరీదైనది. 15 క్యారెట్ల వజ్రం అనేది చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక క్యారెట్ వజ్రం ధర $1,000 నుంచి $20,000 (సుమారు రూ. 85,000 నుంచి రూ. 17 లక్షలు) వరకు ఉంటుంది, ఇది నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 15 క్యారెట్ల వజ్రం, మంచి నాణ్యత కలిగి ఉంటే, దాని విలువ సుమారు $15,000 నుంచి $300,000 (రూ. 12.75 లక్షలు నుంచి రూ. 2.55 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ లభించే అవకాశం ఉంది.
గతంలో మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో 2.69 క్యారెట్ల వజ్రం రూ. 50 లక్షలకు అమ్ముడుపోయిన సందర్భం ఉంది. 15 క్యారెట్ల వజ్రం, సమాన నాణ్యత ఉన్నట్లయితే, దాని విలువ రూ. 2-5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే కర్నూలులో వ్యవసాయకూలీకి లభించిన 15 క్యారెట్ల వజ్రం ఖచ్చితమైన నాణ్యత, రంగు అధికారిక సమాచారం లేదు కాబట్టి ఖచ్చితమైన విలువ అంచనా వేయడం కష్టమే. వారికి ఈ అంశాలపై అవగాహన ఉండదు కాబట్టి స్థానిక వ్యాపారులకే ఇచ్చే అవకాశం ఉంది.
ఒక్క వజ్రం కనుగొనడం వల్ల కూలీలు లేదా రైతుల జీవితాలు ఆర్థికంగా మారిపోతాయి. కర్నూలు ప్రాంతంలో కనుగొనబడే వజ్రాలు వాటి నాణ్యతను బట్టి విలువైనవిగా ఉంటాయి. 15 క్యారెట్ల వజ్రం అనేది అసాధారణమైన పరిమాణం అని చెబుతున్నారు.
వజ్రాలు దొరికితే చాలు.. జీవితం మారిపోతుదని కూలీలు అనుకుంటారు. అందుకే ఎక్కువ మంది వర్షాకాలంలో ఇతర పనులు వదిలేసి.. వజ్రాల వేట ప్రారంభిస్తారు. మొత్తం జల్లెడ పడతారు. గతంలో పలువురికి ఇలా వజ్రాలు దొరికాయి. వారి జీవితాల్లో ఆర్థిక కష్టాలు తొలగిపోయాయి.





















