Kurnool Prime Minister Modi speech: గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది -ఎన్డీఏ నిలబెట్టింది -ఇదిగో ప్రధాని మోదీ పూర్తి స్పీచ్ వివరాలు
Kurnool Modi: చంద్రబాబు విజన్, పవన్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ పొగిడారు. దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి కీలకమన్నారు.

Kurnool Prime Minister Modi speech: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్ అని.. ప్రధాని మోదీ కర్నూలులో అన్నారు..సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందన్నారు. చంద్రబాబు, పవన్ రూపంలో.. ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది.. కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తున్నామన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందని..అభివృద్ధికి ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌గా నిలుస్తామన్నారు. చంద్రబాబు చెప్పినట్టు 21వ శతాబ్ధం భారతావనిదే.. రోడ్లు, రైల్వేలతో కనెక్టివిటీ పెంచుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 16 నెలల్లో ఏపీలో అభివృద్ధి దూసుకుపోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ముఖచిత్రం మారుతుందని పేర్కొన్నారు.
ద్వాదశజ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్ ఆలయం ఉంది. అక్కడే నేను పుట్టాను. రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించి ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి లాంటి శివభక్తులకు ప్రణామాలు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తైన 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా తయారవుతుంది. 21 వ శతాబ్దం భారత దేశానిది, 140 కోట్ల మంది భారతీయులది అవుతుంది. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం కావటంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులతో కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరం. ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించాం... తద్వారా దేశ ఇంధన సామర్ధ్యం పెరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయి... తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువే ఉంది. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నాం. 1400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉంది. తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోందననారు.
శ్రీకాకుళం నుంచి ఆంగుల్ వరకూ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేశాం. దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోంది. 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్ బాటిలింగ్ ప్లాంట్‌ను చిత్తూరులో ప్రారంభించామని గుర్తు చేశారు. మల్టీమోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నాం. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగింది. రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైంది... ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ వేగాన్ని మరింతగా పెంచుతుందన్నారు.
#WATCH | Kurnool, Andhra Pradesh: Prime Minister Narendra Modi says, "As Chandrababu said, looking at this rapid pace, I can say that in 2047, when it will be 100 years of independence, India will be developed. I am confident that the 21st century is going to be the century of… pic.twitter.com/BskaWmAbVz
— ANI (@ANI) October 16, 2025
భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోంది. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ చెప్పారు. డేటా సెంటర్,ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్ సీ కేబుల్ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుందన్నారు. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుంది... సీఎం చంద్రబాబు విజన్ ను అభినందిస్తున్నానన్నారు. దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం ఏపీ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసరమన్నారు. కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి... పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు. ఏపీ వేగవంతమైన అభివృద్ధి కోసం కొప్పర్తి -ఒర్వకల్ పారిశ్రామిక నోడ్ల ద్వారా పచ్చే పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. 21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్ ను చూస్తున్నాయన్నారు. భారత్ లో ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది... ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ కీలకంగా మారిందన్నారు.





















