అన్వేషించండి

Kurnool Chandrababu Naidu Speech: ప్రధాని సంకల్పంతోనే 4వ బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ - కర్నూలు సభలో ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు

Chandrababu Naidu Speech in Kurnool: ప్రధాని మోదీపై కర్నూలు సభలో చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానానికి చేరుస్తారన్నారు.

Chandrababu Naidu showered praises on Prime Minister Modi :  కర్నూలులో సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభకు ప్రధాని మోదీతో కలిసి  ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.  శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుషాల గడ్డ లో జీఎస్టీ బచత్ ఉత్సవ్ సభకు ప్రధాని హాజరు కావటం సంతోషంగా ఉందన్నారు.  జీఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రిగా... ప్రధానిగా 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రధానికి ప్రత్యేక అభినందనలని..  సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోదీ ఓ విశిష్టమైన వ్యక్తి.. 21వ శతాబ్దపు నేతగా ప్రశంసించారు.  ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు. విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్న అరుదైన వ్యక్తి మోద అన్నారు.  ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ పవర్ గా తయారవుతుందన్నారు.                

11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కి.మీ మేర కొత్త హైవేలు, 86 ఎయిర్ పోర్టులు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత ప్రధాని మోదీదేనని గుర్తుచేశారు.   7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ప్రధాని మోదీదే ఇది ఆల్ టైం రికార్డు అన్నారు.  ప్రధాని సంకల్పంతోనే 11 ఏళ్ల క్రితం 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ 4వ స్థానానికి వచ్చిందిని..  2028 నాటికి 3వ, 2038కి 2వ ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుందని జోస్యం చెప్పారు.  ఆర్థికంగా మనం బలం ఏంటో ఈ విజయాలు చెబితే...సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూర్ చాటిందన్నారు.                      

జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు వచ్చాయని.. మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని చద్రబాబు స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని.. గుర్తు చేసుకున్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి.. ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు వచ్చాయి. జీఎస్టీ సంస్కరణలతో బచత్‌ ఉత్సవ్‌.. భరోసా ఉత్సవ్‌గా మారింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో రాష్ట్రానికి డబుల్‌ బెనిఫిట్‌ వచ్చింది. సంక్షేమ పథకాలతో సూపర్‌ సిక్స్‌ను సూపర్‌ హిట్‌ చేశామన్నారు. స్వదేశీ మంత్రం.. మనకు బ్రహ్మాస్త్రం.. అన్నీ మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం.. గర్వ్‌సే కహో.. ఏ స్వదేశీ హై అన్న మోదీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నామని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Embed widget