News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గతంలో సెల్ఫీ వీడియో

సెల్ఫీ వీడియోతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన అక్బర్‌ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. భూ తగదా విషయంలో కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది.

FOLLOW US: 
Share:

కడప జిల్లాలో సెల్ఫీ వీడియోతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన అక్బర్‌ బాషా, తన కుటుంబంతో కర్నూలు చాగలమర్రిలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇద్దరు కూతుర్లతో సహా బాషా దంపతులు పురుగుల మందు తాగారు. వెంటనే స్థానికులు నలుగురిని చాగలమర్రిలోని ఆసుపత్రికి తరలించారు.

కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలోని పొలం తగాదా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని గత కొద్దిరోజులుగా అక్బర్‌బాషా కుటుంబం పోరాడుతోంది. తమకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

ఈ విషయంపై సీఎం కార్యాలయం, కడప ఎస్పీ స్పందించారు. ఎస్పీ అన్బురాజన్‌ నుంచి సీఎం కార్యాలయం వివరాలను సేకరించింది. అనంతరం బాధిత కుటుంబాన్ని ఎస్పీ పిలిపించడంతో తమకు జరిగిన అన్యాయాన్ని అక్బర్‌బాషా వివరించారు. అక్కడికక్కడే ఎస్పీ అన్బురాజన్‌ సీఎం కార్యాలయం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. స్వయంగా సీఎం కార్యాలయం స్పందించడంతో ఈ వివాదానికి ముగింపు పలికిందని అందరూ అనుకున్నారు. అయితే సోమవారం వారు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్య యత్నం ఘటన తెలియగానే చాగలమర్రి, దువ్వూరు పోలీసులు అప్రమత్తం చేశాం.      హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితి వాకబు చేశారు. అక్బర్ బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదు.  ఎకరంన్నర  భూమి అక్బర్ అత్త  ఖాసింబిదిగా మైదుకూరు కోర్టు  2018 లోనే తీర్పు ఇచ్చింది.  మైదుకూరు కోర్టు తీర్పుపై ఎవరూ  పై కోర్టుకు వెళ్ళలేదు.  అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ కోర్టులో తేల్చుకోవాలి.  పోలీసులు సివిల్ విషయాల్లో తలదూర్చడం సరికాదు.
                                                                                             - జిల్లా ఎస్పీ అన్బురాజన్
కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో తనకున్న ఎకరన్నర భూమిని వైకాపా నేత తిరుపేలరెడ్డి కుటుంబం ఆక్రమించిందని అక్బర్ బాషా వీడియోలో చెప్పాడు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోందని.. శుక్రవారం సాయంత్రం మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి మమ్మల్ని పోలీసుస్టేషన్‌కు పిలిపించి బెదిరించారని చెప్పారు. తిరుపేలరెడ్డి చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని హెచ్చరించారని బాషా పేర్కొన్నారు.

Also Read: KTR: కేటీఆర్ పెద్దమనసు.. జీహెచ్ఎంసీ స్వీపర్‌కు ఉన్నత ఉద్యోగం, ఉత్తర్వులు జారీ

Also Read: Chandrababu House Episode: వినతి పత్రం ఇచ్చేందుకే జోగి రమేష్ వెళ్లారు... చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ

Also Read: AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?

Also Read: Vijayawada News: డ్రగ్స్ ముఠాతో విజయవాడకు సంబంధంలేదన్న సీపీ శ్రీనివాసులు... గుజరాత్ ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల హెరాయిన్ పట్టివేత...

Published at : 21 Sep 2021 08:09 AM (IST) Tags: kurnool Kadapa family suicide attempt selfie video kadapa akbar basha selfie video

ఇవి కూడా చూడండి

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు

టాప్ స్టోరీస్

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?