AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ సరఫరా అవుతోంది బెజవాడకు కాదని ఢిల్లీకి అని పోలీసులు చెబుతున్నారు. ఈ డ్రగ్ రాకెట్ కింగ్ పిన్ కోసం విస్తృత స్థాయిలో పరిశోధన జరుగుతోంది.
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.9వేల కోట్ల విలువైన హెరాయిన్ విషయం కీలకమైన మలుపులు తిరుగుతోంది. విజయవాడలో రిజిస్టరైన కంపెనీ వాటిని దిగుమతి చేసుకున్నట్లుగా తేలడంతో ఆ కంపెనీ ఎవరిది? ఆ హెరాయిన్ అంతా ఎక్కడికి సరఫరా చేస్తారు ? ఆ కంపెనీ వెనుక పెద్దలెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విజయవాడలో అషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఉన్న ఓ చిన్నకంపెనీ పేరుతో ఆ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నారు. కానీ ఆ కంపెనీకి సంబంధించిన వారెవరూ అక్కడ ఉండటం లేదు. కంపెనీ ఫోన్ నెంబర్ కాకినాడకు చెందిన వ్యక్తి పేరు మీద ఉండటంతో అతన్ని పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. అషి ట్రేడింగ్ కంపెనీ యజమానులు చెన్నైలో ఉంజటంతో వారి కోసం ప్రస్తుతం వేట సాగుతోంది.
Also Read : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నిజాలు చెప్పడం లేదా? ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన
ఆ హెరాయిన్ విజయవాడకే వస్తోందా..!?
అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌కు చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ ఫర్మ్‌కు ఈ హెరాయిన్ పంపుతోంది. కన్‌సైన్‌మెంట్‌లో విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ ఇచ్చారు. అయితే డెలివరీ ఎక్కడికి అన్నదానిపై స్పష్టత లేదు. ఆ కంపెనీ పేరుతో ఆర్డర్ తీసుకున్నారు కానీ డెలివరీ మాత్రం ఢిల్లీకి అని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడి వ్యక్తుల ప్రమేయంపై పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఇప్పటికైతే సీక్రెట్‌గా నార్కోటిక్ బ్యూరోతో పాటు , ఎన్‌ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా దర్యాప్తు ప్రారంభించినట్లుగా చెబుతున్నారు.
Also Read : ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌కు టాలీవుడ్ ఓకే ! పేర్ని నానితో భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీకి రావట్లేదని స్పష్టం చేసిన పోలీసులు !
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విజయవాడకు సరఫరా చేస్తున్నారన్న దాంట్లో నిజం లేదని కమిషనర్ బత్తిని శ్రీనివాసులు కూడా ప్రకటించారు. గుజరాత్ ముంద్రా పోర్టు నుంచి దిల్లీకి హెరాయిన్ తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉందన్న మాట వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదన్నారు. చెన్నై, అహ్మదాబాద్, దిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయన్నారు. కాబట్టి ఏపీకి ఆ హెరాయిన్ రావడం లేదని.. డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు
డ్రగ్స్ స్మగ్లింగ్ కింగ్ పిన్ ఎవరు ? ఇప్పటి వరకూ ఎంత స్మగ్లింగ్ జరిగింది ?
ఏపీలో కంపెనీని రిజిస్టర్ చేశారు కానీ ఆ డ్రగ్స్‌ను ఏపీకి తీసుకురావడం లేదన్న క్లారిటీని పోలీసులు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కింగ్ పిన్ ఎవరు అనేది పెద్ద మిస్టరీగా మారింది. అదేమీ సాదాసీదా స్మగ్లింగ్ కాదు. దాదాపుగా తొమ్మిరి వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు పట్టుబడ్డారు కానీ గతంలో ఎన్ని సార్లు ఇలా తీసుకు వచ్చి ఉంటారన్నదానిపైనా స్పష్టత లేదు. అదే సమయంలో తెలుగువారి వంద శాతం సంబంధం ఉండదని చెప్పడానికి కూడా లేదంటున్నారు. ఏ సంబందం లేకుండా తెలుగువారి కంపెనీ పేరుతో దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే డ్రగ్స్ కేసులో ఎప్పుడూ అసలు సూత్రధారులు తెర వెనుకే ఉంటారు. ఇప్పుడు కంపెనీని నమోదు చేసి దిగుమతి ప్రయత్నం చేసిన వారికి కూడా ఆ కింగ్ పిన్ ఎవరో తెలియనంత సీక్రెట్‌గా ఉంటారు. దేశ స్థాయిలో అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ జరిపితేనే ఆ కింగ్ పిన్ గురించి బయటకు తెలుస్తుంద్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : ''నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది''