Raj Kundra Bail: పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు
రాజ్‌కుంద్రాకు పోర్నోగ్రఫీ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ మంబుయి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Mumbai court grants bail to businessman and actor Shilpa Shetty's husband Raj Kundra in the pornography case on a surety of Rs 50,000 pic.twitter.com/jtEB9Ixd5C
— ANI (@ANI) September 20, 2021
Along with Raj Kundra, accused Ryan Thorpe also granted bail by a court in Mumbai in the pornography case
— ANI (@ANI) September 20, 2021
రాజ్‌కుంద్రాతో పాటు మరో నిందితుడు ర్యాన్ తోర్పేకు కూడా బెయిల్ మంజూరైంది. అశ్లీల చిత్రాల కేసులో జులై 19 నుంచి రాజ్‌కుంద్రా కస్టడీలో ఉన్నారు.
ఏంటి కేసు..
పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా రాజ్‌కుంద్రాపై అభియోగాలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు.
కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా ఒప్పిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వారితో పోర్న్ మూవీస్ తీస్తున్నారని.. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చిందని.. చిత్రీకరణ తర్వాత కుంద్రా టీం వీడియోలను కెన్రిన్ సంస్థకు ఓ అప్లికేషన్ ద్వారా పంపిస్తోందని పోలీసులు చెబుతున్నమాట. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్ నుంచి హాట్‌షాట్స్ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది..
ఈ పోర్న్ కంటెంట్‌ను చూసేందుకు ఛార్జీలు వసూలు చేసేవారని.. దీని ద్వారా కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.