AP Cabinet Meeting : జూన్‌లో అమ్మ ఒడి, పంటల బీమా - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !
ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమ్మఒడి, రైతు బీమా నిధులు జూన్‌లో లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు పథకాల నిధులను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ 14 న వైఎస్సార్ పంటల బీమా పథకం లో రైతులకి బీమా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను సమాచార మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. జూన్ లో అమ్మవడి మూడో దఫా తల్లుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. పామర్రు లో పిహెచ్సీ ని కమ్యూనిటి హెల్త్ సెంటర్ గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మార్క్ ఫెడ్ లో 30 కొత్త ఉద్యోగాలకు అనుమతి ..ఏపీ లోకాయుక్త లో 16 అదనపు పోస్ట్ లకు ఆమోదం మంత్రివర్గం ఇచ్చిందన్నారు. పెనుగొండ ఆధ్యాత్మిక కేంద్రానికి 40 ఎకరాలు ఇవ్వాలని తీర్మానించారు.
ఏపీలో రాజ్యసభ చాన్స్ ఆ నలుగురికే ! అలీ పేరేది ?
జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయానికి, ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. గతేడాది కంటే ముందుగా వ్యవసాయ సీజన్ ప్రారంభించాలని, సాగుకు సరిపడా నీటిని నిల్వచేయాలని నిర్ణయం" తీుకున్నామన్నారు. ధవళేశ్వరం వద్ద డెడ్ స్టోరేజీని వినియోగించుకోవాలని.. జూన్ 10 నుంచి కృష్ణా డెల్లా, పులిచింతల నీటి వినియోగం పూర్తి కావాలని నిర్ణయించారమన్నారు. జూన్ 30 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల నీరు వినియోగం. నీటి వినియోగానికి సంబంధించి రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు.
ద్రవిడ వర్శిటీ నిర్వీర్యం - కుప్పానికి జగన్ ద్రోహం చేశారన్న చంద్రబాబు !
కేబినెట్ సమావేశంలో ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కచ్చితంగా ప్రతీ ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరిస్తే తక్షణమే పరిష‍్కరించాలని స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ - సగం మందికే ప్రొబేషన్ ?