Chandrababu Kuppam Tour : ద్రవిడ వర్శిటీ నిర్వీర్యం - కుప్పానికి జగన్ ద్రోహం చేశారన్న చంద్రబాబు !
తనపై కోపంతో కుప్పం ద్రవిడ వర్శిటీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు.
కుప్పం ద్రవిడ యూనివర్శిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో ద్రవిడ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడారు. చంద్రబాబును ద్రవిడ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు కలిసి హాస్టల్ దుస్థితిపై చంద్రబాబు కు ఫోటోలు చూపించారు. యూనివర్సిటీలో సమస్యలను చంద్రబాబుకు ఏకరువు పెట్టారు . వైఎస్ఆర్ ప్రభుత్వం యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబుకు వివరించారు. "బాబు రావాలి..బాధలు తీరాలి" అంటూ స్టూడెంట్స్ ఒఎద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలపై గళం ఎత్తిన విద్యార్థులను వేధిస్తున్నారని స్టూడెంట్స్ చంద్రబాబుతో అవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలో ఉద్యోగులపైనా కులం ఆధారం గా వివక్ష చూపుతున్నారని ఓ ఉద్యోగి చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, స్కాలర్ షిప్ లు లేదని ప్రభుత్వంపై విద్యార్ధులు మండిపడ్డారు.. ద్రవిడ యూనివర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.. ద్రవిడ యూనివర్సిటీతో తనకు ప్రత్యేక అనుబందం ఉందని, దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ చేయాలని యూనివర్సిటీని స్థాపించినట్లు వివరించారు..విద్యార్థులకు సౌకర్యాల విషయంలో యాజమాన్యం శ్రద్ద పెట్టాలని కోరారు. ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందని బాబు ప్రశ్నించారు. నా మీద కోపంతో యూనివర్సిటీని దెబ్బ తీస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు.. మహోన్నత లక్ష్యంతో ప్రారంభమైన ద్రవిడ యూనివర్సిటీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. యూనివర్సిటీలో అక్రమ క్వారియింగ్ ఎలా, ఎందుకు జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. యూనివర్సిటీ అధికారులు తప్పులు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్ధితి వస్తుందని హెచ్చరించారు. యూనివర్సిటీ లో బయట వాళ్ళు వచ్చి స్థానికులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అంతకు ముందుచంద్రబాబు కుప్పంలోని ఆర్ అండ్ అతిధి గృహం వద్ద ప్రజల వద్ద విన్నతి పత్రాలు స్వీకరించారు.. ఈ క్రమంలో కుప్పంలోని షాహీ గార్మెంట్సులో పని చేస్తున్న మహిళా కార్మికులు కుప్పం అతిథి గృహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని, మూడు సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదని మహిళా కార్మికులు ఆవేదన చెందుతున్నారు..యాజమాన్యం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని, తమకు జీతాలు పెంచే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్మికులు అంటున్నారు. న్యాయం జరగకపోతే ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా వెనక్కి తగ్గమని వారు హెచ్చరించారు.. చంద్రబాబు శుక్రవారం యాజమాన్యాన్ని పిలిచి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు..
కుప్పం నియోజకవర్గం చింతరపాళ్యం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారి రోడ్ షో, ప్రసంగం. https://t.co/lhVsknNXgJ
— Telugu Desam Party (@JaiTDP) May 12, 2022
అనంతరం కుప్పంలోని పట్టాలమ్మ నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం పోగురుపల్లెతో పాటుగా పలు గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. శుక్రవారం కూడా కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.