IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

AP Rajyasabha Seats : ఏపీలో రాజ్యసభ చాన్స్ ఆ నలుగురికే ! అలీ పేరేది ?

వైఎస్ఆర్‌సీపీలో రాజ్యసభ అభ్యర్థులు ఖరారయినట్లుగా తెలుస్తోంది. రెండు బీసీ, ఒకటి రెడ్డి, మరొకటి ఉత్తరాది వ్యాపారవేత్తకు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అలీ పేరు వినిపించడం లేదు.

FOLLOW US: 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. జూన్ పదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిలో ఒకరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. మిగతా ముగ్గురు బీజేపీ ఎంపీలు.  అయితే ఈ నాలుగు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో ఆశావహులు ఎవరు అన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది తమకు అవకాశం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణాలలు స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలనుకుంటున్నారు. అయితే పారిశ్రామిక వేత్తల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

విజయసాయిరెడ్డికి కొనసాగింపు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిందన్న ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయనకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కోఆర్డినేట్ చేసుకునే పదవి ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డికి మళ్లీ ప్రాధాన్యం పెరిగిందని ఆయన రాజ్యసభ స్థానానికీ ఢోకా లేదని చెబుతున్నారు. 

మిగతా మూడు సీట్లు ఎవరికి ?

విజయసాయిరెడ్డికికి పోగా మిగిలిన వాటిలో  రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా  నెల్లూరు కు చెందిన టీడీపీ బీసీ నేత బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ నుండి  వైఎస్ఆర్‌సీపీలో చేరిన  మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి లకు రాజ్య సభ సీట్లు దక్కకున్నట్టు చెబుతున్నారు.  వీరిలో కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర కు చెందిన కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన నేత. 

మరొకటి అదానీ  ఫ్యామిలీకి.. మరి అలీ సంగతేంటి ? 

ఇక మిగిలిన సీటు ను వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నట్టు సమాచారం.అదానీ భార్య ప్రీతి .లేదా కుమారుడు జీత్ లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అదే జరిగితే దేశంలోని ఇద్దరు ప్రముఖ వ్యాపార వేత్తలకు ఏపీ నుండి రాజ్యసభ సీట్లు దక్కినట్టు అవుతుంది. గతంలో అంబానీ సిఫార్సు మేరకు వ్యాపారవేత్త పరిమల్ నత్వానీ కి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఇటీవల సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన సీఎం జగన్‌ను కూడా కలిశారు. కానీ ఇప్పుడు ఆయన పేరు రేసులో వెనుకబడింది. 

Published at : 12 May 2022 07:33 PM (IST) Tags: YSRCP Vijayasaireddy Rajya Sabha members movie star Ali Adani Rajya Sabha

సంబంధిత కథనాలు

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్‌సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !

Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్‌సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు